ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

EMPLOYEES: కొరవడిన సమయపాలన

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:17 AM

మండలపరిధిలోని కోటపల్లి గ్రామ సచివాలయం సిబ్బంది సమయాపాలన పాటించడం లేదు. ఇష్టానుసా రంగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వివి ధ పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సంబంధిత ఉద్యోగులు వచ్చే వరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ గ్రామ సచివాలయాన్ని సోమవారం ఆంధ్రజ్యోతి విజిట్‌ చేయగా పలు విషయాలు తెలిసొచ్చాయి.

People who are protesting at the secretariat

- ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్న సచివాలయ సిబ్బంది

- ఇబ్బందులు పడుతున్న ప్రజలు

తనకల్లు, జూన 16(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని కోటపల్లి గ్రామ సచివాలయం సిబ్బంది సమయాపాలన పాటించడం లేదు. ఇష్టానుసా రంగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వివి ధ పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సంబంధిత ఉద్యోగులు వచ్చే వరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ గ్రామ సచివాలయాన్ని సోమవారం ఆంధ్రజ్యోతి విజిట్‌ చేయగా పలు విషయాలు తెలిసొచ్చాయి. ఉదయం 10గంటలకు కార్యాలయానికి రావాల్సిన సిబ్బంది ఎవరూ హాజరుకాలేదు. అయితే ముండ్లవారిపల్లి, బీమ్లా నాయక్‌తండా, దండువారిపల్లి, దేవళం తండా, కోటపల్లి తదితర గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఉదయం 9.30 గంటలకే సచివాలయం వద్దకు వేచి ఉన్నారు. ఉదయం 10.52 నిమిషాలకు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ వచ్చా రు.

దీంతో ప్రజలం దరూ ఒక్కసారిగా లేచి కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే తమ పనులకు సంబంధించిన సిబ్బంది ఇంకా రాకపోవడం తో నిరాశతో ప్రజలు ఎదురు చూస్తూ నిలబ డ్డారు. అనంతరం ఉదయం 11 గంటలకు కార్యదర్శి హాజరయ్యారు. మిగిలిన సిబ్బంది తరువాత ఒకొక్కరుగా సచివాలయానికి వచ్చారు. ఉదయం 10గంటలకు రావాల్సిన అఽధికారులు 11 గంటలైనా రాకపోవడం ఏమిటని వారిలో పలువురు చర్చించు కోవడం మొదలు పెట్టారు. సచి వాలయం పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాల, అంగనవాడీ కేంద్రాలకు చెం దిన ఉపాధ్యాయులు, సిబ్బంది సకాలంలో చేరుకుని విధులు నిర్వహి స్తున్నారు. పక్కనే ఉన్న సచివాలయ ఉద్యోగులు సమయ పాలన పాటిం చకపోవడం ఏమిటని ప్రజలంటున్నారు. పర్యవేక్షణ చేసే వారు లేకనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అసహనం వ్యకతఫం చేస్తున్నారు. ఇష్టమొచ్చినప్పుడు రావడం, వెళ్లిపోవడం వారికి పరిపాటిగా మారిందని ప్రజలు అంటున్నారు. సంబం ధిత అధికారులు, ప్రజాప్రతి నిధులు, చర్చించి సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 17 , 2025 | 12:17 AM