ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

VISIT : కొరవడిన సమయపాలన

ABN, Publish Date - Mar 18 , 2025 | 12:30 AM

ప్రభుత్వ ఉద్యోగోలు ప్రతి రోజూ ఉదయం 10గంటలకు కచ్చితంగా కార్యాలయాల్లో విధులకు హా జరు కావాలని ఉత్తర్వులు. అయితే వాటితో మాకు పనిలేదు... మేము వచ్చిందే టైం...వచ్చినప్పుడే విధులు నిర్వహిస్తామన్న చందంగా మారింది హంద్రినీవా సుజల స్రవంతి పథకం, హెచ్చెల్సీ కార్యాలయాల్లో పనిచేసే ఇంజనీర్లు, ఉద్యోగుల తీరు. ఈ తతంగం సోమవారం ఆంధ్రజ్యోతి విజిట్‌లో తేటతెల్లమైంది.

At 10.40 am at the HHSS Division-7 office.

- ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్న ఉద్యోగులు

- హంద్రినీవా, హెచ్చెల్సీ కార్యాలయాల్లో...

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగోలు ప్రతి రోజూ ఉదయం 10గంటలకు కచ్చితంగా కార్యాలయాల్లో విధులకు హా జరు కావాలని ఉత్తర్వులు. అయితే వాటితో మాకు పనిలేదు... మేము వచ్చిందే టైం...వచ్చినప్పుడే విధులు నిర్వహిస్తామన్న చందంగా మారింది హంద్రినీవా సుజల స్రవంతి పథకం, హెచ్చెల్సీ కార్యాలయాల్లో పనిచేసే ఇంజనీర్లు, ఉద్యోగుల తీరు. ఈ తతంగం సోమవారం ఆంధ్రజ్యోతి విజిట్‌లో తేటతెల్లమైంది. హెచ్చెల్సీ కాలనీలోని హెచఎనఎస్‌ఎస్‌, హెచ్చెల్సీ కార్యాల యాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉదయం 12గంటలైనా విధులకు హాజరు కాలేదు. హెచ్చెల్సీ పరిధిలో ఎస్‌ఈ కార్యాలయం, లోక్‌ డివిజన, ధర్మవరం బ్రాంచకెనాల్‌, డిప్యూటీ ఎస్‌ఈ కార్యాలయం, హెచ్చెల్సీ డివిజన పరిధిలోని పీఏబీఆర్‌కు సంబంధించి సబ్‌డివిజన్లలో ఇంజనీర్లు, ఉద్యోగులు పనిచేస్తు న్నారు. ఇక హంద్రినీవా కార్యాలయంలో డివిజన-6, డివిజన-7 కార్యాల యాలతో పాటు ఎస్‌ఈ, డిప్యూటీ ఎస్‌ఈ, జలవనరుల శాఖ ప్రాజెక్ట్స్‌ సీఈ, డిప్యూటీ సీఈ కార్యాలయాలలో ఇంజనీర్లు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే కొందరు ప్రజాసమస్యల పరిష్కార వేదిక పేరుతో, మరికొందరు వ్యక్తిగత పనులంటూ, ఇంకొందరు టీ స్టాల్‌, చెట్ల కింద కాలయాపన చేస్తున్నారు. కొందరు ఉద్యోగ సంఘాల పేరుతో విధులకు ఆలస్యంగా రావ డం, డుమ్మా కొట్టడం పరిపాటిగా మారింది. హెచ్చెల్సీ, హంద్రినీవా అధికా రులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూవస్తున్నారు. దీంతో విధుల కు హాజరు కావాల్సిన ఇంజనీర్లు, ఉద్యోగులు ఆడిందే ఆటగా...పాడిందే పాటగా పరిస్థితిని మార్చేసుకున్నారు. ఇక కొందరు ఇంజనీర్లు, ఉద్యోగులు వే లాది రూపాయలు జీతాలు తీసుకుంటూ కనీసం రోజుకు రెండు గంటల కూడా ప్రభుత్వ విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు పరిస్థితి ఇలా ఉంటే నియోజకవర్గాలు, మండలాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 18 , 2025 | 12:30 AM