MLA: రెండో రోజూ ‘మనింటికి మన ఎమ్మెల్యే’
ABN, Publish Date - Jun 05 , 2025 | 11:48 PM
నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేపట్టిన ‘మనింటికి మన ఎమ్మెల్యే’ కార్యక్రమం రెండో రోజు గురువారం తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లి పంచాయతీ లో నిర్వహించారు.
కదిరి, జూన 5(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేపట్టిన ‘మనింటికి మన ఎమ్మెల్యే’ కార్యక్రమం రెండో రోజు గురువారం తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లి పంచాయతీ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆ పంచాయతీలోని చిన్న న్నవారిపల్లి, ఎస్సీ కాలనీ, కాయలపల్లిల్లో పర్యటించారు. ఇంటింటికెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సరకాలంలో చేసిన అభివృద్ధిని ఆయన ప్రజలకు వివరించారు. గ్రామాల వారీగా చేసిన అభివృ ద్ధిని తెలిపారు. ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను, ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తహసీల్దార్ రెడ్డిశేఖర్, ఎంపీడీఓ నసీమా, టీడీపీ మైనార్టీ నాయకురాలు ఫర్వీనబాను, టీడీపీ మండల కన్వీనర్ ముబారక్, నాయకులు మేడా శంకర్ తదితరులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....
Updated Date - Jun 05 , 2025 | 11:48 PM