KSHEERABHISHEKAM : సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN, Publish Date - Jun 14 , 2025 | 12:13 AM
మండలకేంద్రంలో శుక్రవారం తల్లికి వందనం పథకం లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రాసద్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. స్థానిక 237 బూత కమిటీ కన్వీనర్ చాకివేల శిరీష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైసీపీ పాలనలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకాన్ని ఇచ్చార న్నారు.
తనకల్లు, జూన 13(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో శుక్రవారం తల్లికి వందనం పథకం లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రాసద్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. స్థానిక 237 బూత కమిటీ కన్వీనర్ చాకివేల శిరీష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైసీపీ పాలనలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకాన్ని ఇచ్చార న్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు చదువుతుకుంటే అందరికి అమ్మకు వందనం రూ.13వేలు వేసినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో ప్రియాంక, అంజలి, వనజా, జానకీ, నాజీయా, మస్తాన, తల్లిదండ్రులున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....
Updated Date - Jun 14 , 2025 | 12:13 AM