MLA: జగనరెడ్డీ... మీ ఇంట్లో వారికి న్యాయం చెయ్
ABN, Publish Date - Apr 08 , 2025 | 11:50 PM
జగనరెడ్డీ... ముందుగా మీ ఇంట్లో వారికి న్యాయం చేసి, ఆ తర్వాత ప్రజల వద్దకు రావాలని ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సూచించారు. ఆయన మంగళవారం నగరంలోని 11వ డివిజనలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వ హించారు. పాతూరు చెన్నకేశవస్వామి ఆలయం నుంచి ఇంటింటికి వెళ్లి సమస్యలపై ఆరా తీశారు.
- ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం అర్బన, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : జగనరెడ్డీ... ముందుగా మీ ఇంట్లో వారికి న్యాయం చేసి, ఆ తర్వాత ప్రజల వద్దకు రావాలని ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సూచించారు. ఆయన మంగళవారం నగరంలోని 11వ డివిజనలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వ హించారు. పాతూరు చెన్నకేశవస్వామి ఆలయం నుంచి ఇంటింటికి వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఐదేళ్లల్లో కనీసం ఒక డ్రైనేజీ కూడా తీయలేదని, తట్టెడు మట్టి ఎత్తలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. రూ.750 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని త్వరలోనే చేపడతామన్నారు. రూ. 88 కోట్లతో నడిమివంక ప్రొటెక్షన వాల్ నిర్మిస్తామన్నారు. రూ.16 కోట్లతో డంపింగ్ యార్డు క్లియ రెన్స పనులు చేపడతామని, త్వరలోనే మరోచోటికి తరలిస్తామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి తాము నిత్యం పని చేస్తున్నామన్నారు. మరోవైపు జగనరెడ్డి పర్యటనపై ఎమ్మెల్యే స్పందించారు. జగనకు మొదటి నుంచి శవ రాజకీయాలు చేయడం అల వాటేనన్నారు. మీ సొంత బాబాయి హత్యను కూడా రాజకీయాలకు వాడుకున్నావంటూ జగనపై మండిపడ్డారు. మీ ఇంట్లో తల్లి,చెల్లికి న్యాయం చేసిన త ర్వాతనే ప్రజల్లోకి రావాలన్నారు. పాపిరెడ్డిపల్లిలో క్షణికావేశంలో జరిగిన సంఘటనను కులాలు, పార్టీలకు ఆపాదించడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఎంహెచఓ విష్ణుమూర్తి, టీడీపీ నాయకులు గంగారామ్, రాయల్ మధు, రవికుమార్, రమేష్, సరిపూటి రమణ, కుంచెపు వెంకటేష్, సిమెంట్ పోలన్న, ఫిరోజ్ అహ్మద్, ఇస్మాయిల్, పోతుల లక్ష్మీనరసింహులు, పరమేశ్వరన, పీఎల్‌ఎన మూర్తి, సైఫుద్దీన, ముక్తియార్, వెంకటేశ్వరరెడ్డి, బెస్త అంజి, వడ్డే భవానీ, మంజుల, కంఠాదేవి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Apr 08 , 2025 | 11:50 PM