ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

COVID Case: కరోనా కలకలం.. అనంతలో తొలి కేసు

ABN, Publish Date - Jun 05 , 2025 | 10:10 AM

COVID Case: అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. ఓ మహిళకు కరోనా పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది.

COVID Case

అనంతపురం, జూన్ 5: రాష్ట్రంలో కరోనా (Covid 19) కలకలం రేపుతోంది. రోజు రోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. నగరంలోని పాతూరుకు చెందిన ఓ మహిళకు జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు అనుమానంతో మహిళలకు కొవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆస్పుపత్రిలో వైద్యం తీసుకోవాలని మహిళకు వైద్యులు సూచించారు. అయితే అందుకు ఆమె నిరాకరించింది.


హోం ఐసోలేషన్‌లో ఉంటానని వైద్యులకు మహిళ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలో కొవిడ్ కేసు నమోదు అవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలో కూడా కరోనా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు నలుగురు కరోనా బారిన పడినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్‌కు అనుగుణంగా వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తెలిపే మార్గదర్శకాలను పాటిస్తూ సహకరించాలని ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా బారిన పడినప్పటికీ చికిత్స పొంది కోలుకోవచ్చని భయపడాల్సి అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు.


మరోవైపు దేశవ్యాప్తంగా కూడా కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1238 కొత్త కేసులు నమోదు అవగా.. ఏడుగురు మృతి చెందారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 4,866కు చేరాయి. అలాగే కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,955గా ఉంది. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు కరోనా బారిన పడి మృతి చెందారు.


ఇవి కూడా చదవండి

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో మ్యాచ్‌ ఫిక్సింగ్‌

తప్పుడు ఇంజెక్షన్‌తో ఆరుగురి మృతి!

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 10:53 AM