WATER : తాగునీటికి కటకట
ABN, Publish Date - Mar 16 , 2025 | 11:46 PM
మండల పరిధిలోని సి.బండమీదపల్లి బీసీ కాలనీ వాసులు తాగునీటిని డ్రిప్పు వైరు ద్వారా పట్టు కోవాల్సి వస్తోంది. గ్రామంలో జరిగిన జాతీయ రహదారి పనుల సమయంలో బీసీ కాలనీ చెందిన తాగునీటి పైపులైన్లు చాలా మటుకు ధ్వంసం అయ్యాయి. దీంతో వారు ఊరు చివర కొంత బాగున్న పైపు లైనకు డ్రిప్పు వైరు తగిలించుకుని తాగునీటిని పట్టుకుంటున్నారు.
శింగనమల, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని సి.బండమీదపల్లి బీసీ కాలనీ వాసులు తాగునీటిని డ్రిప్పు వైరు ద్వారా పట్టు కోవాల్సి వస్తోంది. గ్రామంలో జరిగిన జాతీయ రహదారి పనుల సమయంలో బీసీ కాలనీ చెందిన తాగునీటి పైపులైన్లు చాలా మటుకు ధ్వంసం అయ్యాయి. దీంతో వారు ఊరు చివర కొంత బాగున్న పైపు లైనకు డ్రిప్పు వైరు తగిలించుకుని తాగునీటిని పట్టుకుంటున్నారు. కాలనీలో దాదాపు వంద కుటుంబాలు ఉన్నాయి. కాలనీలోని డ్రిప్పు పైపు ద్వారా ఒక్కో కుటుంబం రోజుకు నాలుగు నుంచి ఆరు బిందెల వరకు వంతుల వారీగా నీటిని పట్టుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇలా దాదాపు మూడేళ్లు కావస్తోంది. దీంతో కాలనీ మహిళలు దాదాపు 20 రోజులు కిందట పెద్ద ఎత్తున రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కాలనీకి నూతన పైపైలైన్లు వేయాలని అఽధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశంతో అధికా రులు కాలనీకి సంబంధిం చి రోడ్డుపక్కన నూతన పైపులైన వేసి కొళాయి లు ఏర్పాటు చేశారు. కానీ పైపులైన ఎత్తు ప్రాంతంలో ఉండడంతో పాత బోరు నుంచి నీరు ఎక్కడం లేద ని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. దీంతో కాలనీకి నీరంద డం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కాలనీకి నీరు ఎలా సరఫరా చేయాలో ఆర్థాం కాలేదని కొందరు అధికారులు అంటున్నారు. అయితే తగిన చర్యలు తీసుకుని తమకు తాగు నీటి కష్టాలు పరిష్కరించాలని కాలనీ మహిళలు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Mar 16 , 2025 | 11:46 PM