Home » Singanamala
మండలంలోని యర్రగుంట్లలో ఎర్రిస్వామి అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. ఈ మేరకు బాధితుడు గురువా రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యర్రగుంట్ల గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, రేణుక దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.
మండలంలోని సలకంచెరువు, నిదనవాడ తరిమెల,కల్లుమడి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను, చెత్తతో సంపద తయారీ కేంద్రాలను జిల్లాపరిషత సీఈఓ శివశంకర్‌ప్రసాద్ గురువారం పరిశీలించారు.
జిల్లాలోని రెండు సహకార సొసైటీలకు కమిటీలను నియమిస్తూ రాష్ట్ర సహకార శాఖ ప్రత్యేక ప్రఽధాన కార్యదర్శి రాజశేఖర్ బుధవారం జీఓ నంబరు 921ను జారీ చేశారు.
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు భారం తగ్గి, ప్రతి కుటుంబంలో వెలుగులు నింపే నిర్ణయాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు. మండల కేంద్రంలో జీఎస్టీ తగ్గింపుతో ధరల తగ్గుదలపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాకు ఆర్డీటీ సేవలు అత్యవసరమని, ఆ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేసి ఇబ్బందులు తీర్చాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. శాసనసభ సమావేశంలో సోమవారం ఆమె మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ ద్వారా లక్షల మంది పేద వర్గాలకు విద్య, వైద్యం సదుపాయంతో పాటు వ్యవసాయ రంగంలో సహకారం అందుతోందన్నారు.
మండల కేంద్రంలోని ఎరువుల దు కాణాలను, వాటి గోడౌనలను తహసీల్దార్ అరుణకుమారి, వ్యవసాయాధికారి చెన్నవీరస్వామి సోమవారం తనిఖీ చేశారు.
తొలగించిన తమ పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. మండలంలోని పింఛన తొలిగిస్తున్నట్లు 370 మంది దివ్యాంగులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో దివ్యాంగులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనై సోమవారం మండలకేంద్రానికి తరలివచ్చి అనంతపురం - తాడిపత్రి రహదారిపై బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యూవల్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. నార్పల, గార్లదిన్నెలో మహిళా సంఘాల సభ్యులతో కలిసి సోమవారం ర్యాలీలు నిర్వహించారు.
మండలంలోని శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. ముందస్తు వర్షాలకు వేరుశనగ పంటను సాగుచేశారు. తరువాత వర్షం రాకపోవడంతో ఆ పంట ఎండుముఖం పట్టింది.
మండలంలోని గూగూడు కుళ్లాయిస్వామి ఆలయంలో హుండీల లెక్కింపును శుక్రవారం నిర్వహించారు.