ROBARIES : దొంగలు బాబోయ్... దొంగలు..!
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:56 PM
చీకటి పడితే చాలు గ్రామా ల్లో దొంగలు చెలరేగిపోతున్నారు. వివిధ షాపులు, తాళం వేసి ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. గార్లదిన్నె, కల్లూరు, మర్తాడు, యర్రగుంట్ల తదితర గ్రామాల్లో ఇళ్లను కొల్లగొడుతున్నారు.
భయాందోళనల్లో ప్రజలు
గార్లదిన్నె, డిసెంబరు30(ఆంధ్రజ్యోతి): చీకటి పడితే చాలు గ్రామా ల్లో దొంగలు చెలరేగిపోతున్నారు. వివిధ షాపులు, తాళం వేసి ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. గార్లదిన్నె, కల్లూరు, మర్తాడు, యర్రగుంట్ల తదితర గ్రామాల్లో ఇళ్లను కొల్లగొడుతున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇళ్లకు వేసిన తాళాలను పగలకొట్టి ఇంట్లో బంగారం, డబ్బులతో ఉడాయిస్తున్నాడు. అలాగే ఇళ్లు, షాపుల వద్ద ఉంచిన ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళుతున్నారు. ఆయా గ్రామాలు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కల్లూరులో ద్విచక్ర వాహనం చోరీకి యత్నం: కల్లూరు గ్రామంలోని జామీయ మసీద్ సమీపంలో దాదాఖలందర్ అనే వ్యక్తి సోమవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమానికి బంధువులు, తెలిసిన వారు వెళ్లారు. ద్విచక్ర వాహనాలను ఇంటి ముందు పెట్టారు. సోమవారం అర్థ రాత్రి ఇంటి ముందు ఉన్న వాహనాల్లో ఒకదాన్ని ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. తాళం రాకపోవడంతో వాహనాన్ని ఽధ్వంసం చేశారు. ఆ సమయంలో తెలిసిన వారు కేకలు వేయడంతో వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఆ సమయంలో అక్కడికి వెళితే దొంగలు ఏ మైనా చేస్తారని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మిన్నకుండి పోయారు. ఇప్పటికే గ్రా మాల్లో ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు దొంగతనాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
చోరీలను నియంత్రిస్తాం
- ఎస్‌ఐ మహమ్మద్‌గౌస్ బాషా
గ్రామాల్లో చరీలు జరగకుండా తగిన చర్యలు చేపడుతున్నాం. గ్రామాల్లో రాత్రి సమయంలో గస్తీలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే దొంగలను పట్టుకుని వారి నుంచి సొమ్ము రికవరీ చేశాం. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్నాం. చోరీల నియంత్రణకు కఠిన చర్యలు చేపడతాం.