Polio పోలియో చుక్కలు తప్పక వేయించాలి
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:59 AM
ఐదేళ్లలోపు వయసు గల చిన్నారులందరికీ తల్లిదండ్రులు ఈ నెల 21వ తేదీన ఆదివారం పోలియో చుక్కలు తప్పక వేయించాలని తరిమెల వైద్యాధికారి డాక్టర్ శంకర్ నాయక్, ఎంపీడీఓ భాస్కర్ సూచించారు.
- రేపు జరిగే పల్స్‌పోలియోపై అవగాహన ర్యాలీలు
శింగనమల, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలోపు వయసు గల చిన్నారులందరికీ తల్లిదండ్రులు ఈ నెల 21వ తేదీన ఆదివారం పోలియో చుక్కలు తప్పక వేయించాలని తరిమెల వైద్యాధికారి డాక్టర్ శంకర్ నాయక్, ఎంపీడీఓ భాస్కర్ సూచించారు.
శింగనమల మండలకేంద్రంలో శుక్రవారం వారు పల్స్‌పోలియోపై అవగాన ర్యాలీని సిబ్బందితో కలిసి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారులకు ఈనెల 21న పోలియో చుక్కలు వేస్తారన్నారు. మండలంలో 43 బూతలలో ఈకార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. అందరూ విజయవంతం చేయాలని కోరారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి, సిగింల్ విండో అధ్యక్షుడు గుర్రం లక్ష్మీనారాయణ, నాయకులు గుత్తా ఆదినారాయణ, శివరంగారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..