MLA SRAVANI: సూపర్ జీఎస్టీతో ప్రతి కుటుంబంలో వెలుగు
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:11 AM
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు భారం తగ్గి, ప్రతి కుటుంబంలో వెలుగులు నింపే నిర్ణయాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు. మండల కేంద్రంలో జీఎస్టీ తగ్గింపుతో ధరల తగ్గుదలపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నార్పల, అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు భారం తగ్గి, ప్రతి కుటుంబంలో వెలుగులు నింపే నిర్ణయాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు. మండల కేంద్రంలో జీఎస్టీ తగ్గింపుతో ధరల తగ్గుదలపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని వాణిజ్య సముదాయాల దగ్గరకు వెళ్లి కొనుగోలు చేస్తున్న ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు, ఆకుల ఆంజనేయులు, ఆకుల విజయ్‌కుమార్, బాబు, ప్రతా్‌పచౌదరి, తిప్పన్న, జాఫర్‌వలి, రాజన్న, నాయకుడు, బండ్లపల్లి కుళ్లాయప్ప, పీఎల్ లక్ష్మీనారాయణ, చంద్రబాబు పాల్గొన్నారు.
కనగానపల్లి(ఆంధ్రజ్యోతి): సూపర్ జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మార్కట్ యార్డు చైర్మన సుధాకర్ చౌదరి అన్నారు. జీఎస్టీ ప్రయోజనాలపై శుక్రవారం ఆయన వేపకుంట గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు.