MLA SRAVANI: ఆర్డీటీ సేవలు అత్యవసరం
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:08 AM
ఉమ్మడి జిల్లాకు ఆర్డీటీ సేవలు అత్యవసరమని, ఆ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేసి ఇబ్బందులు తీర్చాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. శాసనసభ సమావేశంలో సోమవారం ఆమె మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ ద్వారా లక్షల మంది పేద వర్గాలకు విద్య, వైద్యం సదుపాయంతో పాటు వ్యవసాయ రంగంలో సహకారం అందుతోందన్నారు.
శింగనమల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాకు ఆర్డీటీ సేవలు అత్యవసరమని, ఆ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేసి ఇబ్బందులు తీర్చాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. శాసనసభ సమావేశంలో సోమవారం ఆమె మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ ద్వారా లక్షల మంది పేద వర్గాలకు విద్య, వైద్యం సదుపాయంతో పాటు వ్యవసాయ రంగంలో సహకారం అందుతోందన్నారు. ఆర్డీటీ ద్వారా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నట్లు వివరించారు. ఆర్డీటీని కాపాడే దిశగామంత్రి నారా లోకేశ, రాష్ట్ర ఎంపీలు ఇప్పటికే కేంద్ర హోమంత్రి అమితషాను కలిసి, సమస్యను వివరించినట్లు తెలిపారు. ఆర్టీటీకి శాశ్వత పరిష్కారం చూపేలా కేంద్రంతో రాష్ట్ర నాయకత్వం మాట్లాడుతోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.