Share News

Inspection ఎరువుల దుకాణాల తనిఖీ

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:44 AM

మండల కేంద్రంలోని ఎరువుల దు కాణాలను, వాటి గోడౌనలను తహసీల్దార్‌ అరుణకుమారి, వ్యవసాయాధికారి చెన్నవీరస్వామి సోమవారం తనిఖీ చేశారు.

Inspection  ఎరువుల దుకాణాల తనిఖీ

నార్పల, ఆగస్టు25(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎరువుల దు కాణాలను, వాటి గోడౌనలను తహసీల్దార్‌ అరుణకుమారి, వ్యవసాయాధికారి చెన్నవీరస్వామి సోమవారం తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా స్టాక్‌ రి కార్డులను పరిశీలించారు. అనంతరం దుకాణాల యజమానులతో మాట్లాడుతూ ఎమ్మార్పీకే యూరియా విక్రయించాలన్నారు. నార్పల మండలంలో 71 మెట్రిక్‌ టన్ను యూరియా స్టాక్‌ ఉందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రసాద్‌, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Aug 26 , 2025 | 12:44 AM