LAND: పరిహారంలో అయోమయం..!
ABN, Publish Date - Jun 05 , 2025 | 11:41 PM
జాతీయ రహదారి నిర్మాణం - 342 నిర్మాణంలో భాగంగా కోల్పోయిన భూములకు సరైన పరిహారం అందడం లేదంటూ మండలంలోని భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం తక్కువ అందుతుందని భూమి సేకరించిన తరువాత అధికారి కంగా తెలిజేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు.
- హైవే భూ నిర్వాసితుల్లో ఆందోళన
- రిజిసే్ట్రషన విలువ ప్రకారం ఇవ్వాలని డిమాండ్
- పదకొండు రోజులుగా పనుల అడ్డగింపు
ముదిగుబ్బ, జూన 5(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి నిర్మాణం - 342 నిర్మాణంలో భాగంగా కోల్పోయిన భూములకు సరైన పరిహారం అందడం లేదంటూ మండలంలోని భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం తక్కువ అందుతుందని భూమి సేకరించిన తరువాత అధికారి కంగా తెలిజేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. పరిహారం విష యంలో న్యాయం జరిగే వరకు మండలంలో రహదారి నిర్మాణ పనులు జరగనివ్వమని, గత నెల 26వ తేదీ నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. పదకొండు రోజులుగా రోడ్డు పనులను అడ్డుకుంటూ నిరసన తెలపుతున్నా రు. మండల, జిల్లా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
మార్కెట్ విలువ కోట్లల్లో.... పరిహారం లక్షల్లో
జాతీయ రహదారి - 342ను భాగంగా ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు దాదాపు 42 కిలోమీటర్ల మేర రూ. 300 కోట్లతో పది మీటర్ల వెడ ల్పుతో నిర్మిస్తున్నారు. స్టేజ్ -1 కింద జరుగుతున్న ఈ పనుల్లో భాగంగా మండలంలో 1.6 కిలో మీటర్ల బైపాస్ నిర్మాణానికి 16 ఎకరాల భూమిని సేకరించారు. సుమారు 20 మంది రైతులు భూములు కోల్పోతున్నారు. ముదిగుబ్బ శివార్లలో ఎకరం భూమి కదిరి రిజిసే్ట్రషన వ్యాల్యూ ప్రకారం మార్కెట్ విలువ రూ. కోటి ధర పలుకుతుంటే రైతులకు మాత్రం రూ. లక్షల్లో పరిహారం అందజేస్తున్నారు. అందులో గుంజేపల్లి పరిధిలోని భూములకు ఎకరానికి రూ. 12 లక్షలు, దొరిగల్లు పరిధిలోని భూములకు రూ.7.5 లక్షల పరిహారం ఇస్తామని అధికారులు చెప్పడంతో అందుకు రైతులు ఒప్పుకోవడం లేదు. వరుసగా పదకొండు రోజుల నుంచి పనులను అడ్డుకొని ధర్నా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమ గోడు పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు.
గడువులోగా రోడ్డు పూర్తయ్యేనా...?
ముదిగుబ్బ నుంచి కోడూరు మధ్య 342వ జాతీయ రహదారి నిర్మాణ పనులు 2023లో ప్రారంభమయ్యాయి. ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి, గోరంట్ల మీదుగా చిలమత్తూరు మండలంలోని కోడూరు వరకు 80 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తున్నారు. మొదటి విడతలో ముదిగుబ్బ నుంచి పుట్టపర్తికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. ముదిగుబ్బ, బుక్కపట్నం మండలాల పరిధిలోని ఆర్వోబీ, కల్వర్టుల వద్ద పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. పుట్టపర్తి సమీపంలో రోడ్డు నిర్మాణం ఇంకా చేపట్టాల్సి ఉంది. అలాగే పుట్టపర్తి నుంచి కోడూరు మధ్యలో నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబరు లోగా పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే రిజిసే్ట్రషన వాల్యూ ప్రకారం పరిహారం ఇవ్వంతే పను లు జరుగనివ్వమని ముదిగుబ్బ మండలంలోని భూనిర్వాసితులు పదకొండు రోజుల నుంచి పనులను అడ్డుకుంటున్నారు. దీంతో గడువులోగా జాతీయ రహదారి పనులు పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం - రాఘవేంద్ర, ఎనహెచ జేఈఈ, పుట్టపర్తి
భూసేకరణ చట్టం ప్రకారం రిజిసే్ట్రషన విలువ కంటే రెండున్నర రెట్లు పెంచి పరిహారం ఇస్తున్నాం. ఆ పరిహారానికి రైతులు ఒప్పుకోవడం లేదు. భూ పరిహారం ఇంకా పెంచాలని, పదకొండు రోజులుగా రైతులు పనుల ను అడ్డుకుంటూ ధర్నా చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
Updated Date - Jun 05 , 2025 | 11:41 PM