ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

yoga యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: జడ్పీ చైర్‌పర్సన

ABN, Publish Date - Jun 08 , 2025 | 01:01 AM

క్రమం తప్పకుండా యోగాసనాలు వేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా పరిషత చైర్‌పర్సన గిరిజమ్మ సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజనాయుడు ఆధ్వర్యంలో నగరంలోని ఎంవైఆర్‌ ఫంక్షన హాల్లో యోగాసనాలు వేసే కార్యక్రమం చేపట్టారు.

అనంతపురం న్యూటౌన/క్లాక్‌టవర్‌, జూన 7(ఆంధ్రజ్యోతి): క్రమం తప్పకుండా యోగాసనాలు వేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా పరిషత చైర్‌పర్సన గిరిజమ్మ సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజనాయుడు ఆధ్వర్యంలో నగరంలోని ఎంవైఆర్‌ ఫంక్షన హాల్లో యోగాసనాలు వేసే కార్యక్రమం చేపట్టారు.


ముఖ్య అతిఽథిగా జెడ్పీ చైర్‌పర్సన హాజరై మాట్లాడారు. నిత్యం యోగాసనాలు వేస్తే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ప్రతిఒక్కరు యోగాసనాలు వేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. యోగాసనాల గురించి , మన సంస్కృతీ సాంప్రదాయాల గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ.. యోగాసనాలను దినచర్యలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రోజూ 45 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయాలని సూచించారు. డీఎంహెచఓ ఈబీ దేవి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు యోగాంధ్ర కార్యక్రమంలో పేర్లను రిజిస్ట్రేషన చేసుకుని 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీపీఆర్‌ఓ గురుస్వామి శెట్టి, ఆయూష్‌ విభాగం డాక్టర్‌ భాస్కర్‌, ఈషా ఫౌండేషన స్వామీజీ దక్షరి, యోగా గురువులు కృష్ణవేణి, గురురాజరావు, అనంతపురం రూరల్‌ ఎంపీడీఓ దివాకర్‌, డిప్యూటీ ఎంపీడీఓలు వెంకటనాయుడు, ఆనంద్‌బాబు, ఏఓలు నాగరాజు, సొమశేఖర్‌, సెక్రటరీలు అశోక్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌, పలువురు నగరవాసులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jun 08 , 2025 | 01:01 AM