Borugadda Anil Case.. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు
ABN, Publish Date - Mar 10 , 2025 | 10:05 AM
అనంతపురం: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. బోరుగడ్డ అనిల్ తల్లికి కేవలం కూతుళ్లు మాత్రమే దగ్గరుండి సర్జరీ చేయించినట్టు పోలీసుల విచారణలో బట్టబయలైంది.చెన్నై అపోలో హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలించారు.
అనంతపురం: రౌడీ షీటర్ (Roudy Sheeter) బోరుగడ్డ అనిల్ కేసు (Borugadda Anil Case)లో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని (Health Claim) బెయిల్ (Bail) పొందిన బోరుగడ్డ.. చెన్నై(Chennai)కి వెళ్లలేదని అనంతపురం పోలీసులు (Anantapuram Police) ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చెన్నై అపోలో హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలించారు. బోరుగడ్డ అనిల్ తల్లికి కేవలం కూతుళ్లు మాత్రమే దగ్గరుండి సర్జరీ చేయించినట్టు పోలీసుల విచారణలో బట్టబయలైంది. బోరుగడ్డ అనిల్ జైల్లో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడిన వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బోరుగడ్డ అనిల్ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. హైదరాబాదులో బోరుగడ్డ అనిల్‌కు షెల్టర్ ఎవరు ఇచ్చారనే కోణంలో కీలక విషయాలు సేకరించారు. తమ విచారణలో వెళ్లడైన విషయాలను సోమవారం పోలీసులు హైకోర్టుకు సమర్పించినున్నారు. ఇప్పటికే చెన్నై అపోలో హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ సైతం పరిశీలించిన నివేదికను కూడా పోలీసులు సిద్దం చేశారు.
Also Read:
నలుగురు బాలికలు, ఓ మహిళ మిస్సింగ్ కలకలం..
కాగా రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ వీడియోపై అనంతపురం పోలీసులు సీరియస్ అయ్యారు. ఫోర్జరీ మెడికల్ సర్టిఫికెట్ (Forged medical certificate) విషయాన్ని దాచి వీడియోలో మొసలి కన్నీరు కార్చిన బోరుగడ్డ అనిల్ 111సెక్షన్ వర్తించందంటూ వీడియో రిలీజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోర్త్ టౌన్ సిఐ సాయినాథ్ వేధించారంటూ ఆరోపించడం వెనుక బోరుగడ్డ అనిల్ బెదరింపు ధోరణి ఉందని, బోరుగడ్డ కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. తెలంగాణాలో ఉంటూ వీడియో రిలీజ్ చేసినట్లు అనంతపురం పోలీసులు గుర్తించారు. కాగా ఇప్పటికే అనిల్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు బెయిల్ కోసం పోర్జరీ సర్టిఫికెట్ సృష్టించిన దానిపై పూర్తి ఆధారాలతో గుంటూరు పోలీసులు అనంత పోలీసులకు నివేదిక అందచేశారు.
తనకు గానీ, తన కుటుంబానికి గానీ హాని జరిగితే సీఎం, డిప్యూటీ సీఎం, లోకేశ్ బాధ్యత వహించాలన్నాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న పోలీసులు బోరుగడ్డ వెనుక బలమైన శక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జైలు నుంచి విడుదలయినప్పటి నుంచి బోరుగడ్డ ఎవరెవరిని కలిశాడనే దానిపై ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియోను ఎక్కడి నుంచి విడుదల చేశాడు.. అనేదానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో టెక్నికల్ బృందం పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తోంది. తాను తల్లితో చెన్నైలోనే ఉన్నట్లు బోరుగడ్డ చెప్పినప్పటికీ ఆయన తెలంగాణలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకు వైసీపీ నాయకులు ఆశ్రయం ఇచ్చినట్లు కూడా పోలీసుల దృష్టికివచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మూలవిరాట్‌ను తాకని సూర్య కిరణాలు..
సోమవారం గ్రూప్-1 ఫలితాలు విడుదల
జనసేన నేత పార్టీ నుంచి సస్పెండ్..
Read Latest Telangana News and National News
Updated Date - Mar 10 , 2025 | 10:25 AM