Arasavelli:అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు రెండవ రోజూ నిరాశే
ABN , Publish Date - Mar 10 , 2025 | 07:46 AM
అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. స్వామివారి మూలవిరాట్‌ను రెండో రోజు సోమవారం కూడా సూర్య కిరణాలు తాకలేదు. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు.
శ్రీకాకుళం: అరసవల్లి (Arasavelli) సూర్యనారాయణ స్వామి (Suryanarayana Swamy) భక్తులకు (devotees) రెండవ రోజు (2nd Day) సోమవారం (Monday) కూడా నిరాశే (Disappointment) ఎదురైంది. పొగమంచు (Fog), మేఘాల (Clouds) కారణంగా.. స్వామి వారి మూల విరాట్‌ను సూర్య కిరణాలు (Sun rays)తాకలేదు. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కానీ ఈ రోజు కూడా సూర్యకిరణాలు మూల విరాట్‌ను తాకలేదు.
Also Read:
సోమవారం గ్రూప్-1 ఫలితాలు విడుదల
కాగా ఆదివారం కూడా అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు నిరాశ కలిగింది. స్వామివారి మూలవిరాట్‌ను సూర్య కిరణాలు తాకలేదు. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మబ్బులు, పొగమంచు కారణంగా కిరణ స్పర్శకు అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో భాగంగా ప్రతీ ఏటా ఉత్తరాయణం మార్చి 9,10 తేదీలలోను దక్షిణాయణం అక్టోబర్ 1,2 తేదీలలో స్వామి వారి మూలవిరాట్టును సూర్య కిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది.
కాగా అరసవల్లిలో ఆదిత్యాలయం భక్తజన సంద్రమైంది. ఓ వైపు ఆదివారం.. మరోవైపు ఆదిత్యుడి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకనున్న నేపథ్యంలో ఉదయం 6 గంటలకే పెద్ద ఎత్తున భక్తులు అరసవల్లికి తరలివచ్చారు. క్యూలో బారులుదీరారు. కిరణాల తాకిడితో బంగారు వర్ణంలో మెరిసిపోనున్న ఆదిత్యుడ్ని దర్శించుకోవాలని భావించారు. కానీ ఆకాశంలో మబ్బుల కారణంగా కిరణాలు స్వామిని తాకలేదు. దీంతో భక్తులు నిరాశ చెందారు. అనంతరం స్వామిని దర్శించుకుని వెనుదిరిగారు. కొంతమంది భక్తులు ఇంద్రపుష్కరిణిలో స్నానాలు ఆచరించి రావిచెట్టు వద్ద పూజలు చేశారు. మరికొందరు క్షీరాన్నం వండి స్వామికి నైవేద్యం సమర్పించారు. ఆదివారం ఒక్కరోజే ఆదిత్యుడికి రూ.8,54,950 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల ద్వారా రూ.5,97,800, విరాళాల ద్వారా రూ.91,525, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,65,635 వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News