Missing: నలుగురు బాలికలు, ఓ మహిళ మిస్సింగ్ కలకలం..
ABN , Publish Date - Mar 10 , 2025 | 09:17 AM
నెల్లూరు జిల్లా: వెంకటగిరి పోలీస్ సర్కిల్ పరిధిలో నలుగురు బాలికలు, ఓ మహిళ మిస్సింగ్ కావడం కలకలం రేపింది. వారు ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన వారి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నెల్లూరు జిల్లా: వెంకటగిరి పోలీస్ సర్కిల్ (Venkatagiri Police Circle) పరిధిలో నలుగురు బాలికలు (Girls), ఓ మహిళ (Woman) మిస్సింగ్ (Missing) కావడం కలకలం (Kalakalam) రేపింది. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతూ, ఎస్సీ హాస్టల్లో ఉంటున్న ముగ్గురు బాలికలు, బొప్పాపురం సాలికాలనీకి చెందిన రాయవరం లిఖిత అనే బాలిక 16 (ఏళ్లు), డక్కిలి మండలం మాటుమాడుగు గ్రామానికి చెందిన స్వర్ణ దేవి అనే మహిళ మిస్సింగ్ అయ్యారు. వారు ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన వారి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఎస్సీ హాస్టల్ నుంచి మిస్సింగ్ ఆయన ముగ్గురు బాలికలను పోలీసులు తిరుపతిలో గుర్తించినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read:
జనసేన నేత పార్టీ నుంచి సస్పెండ్..
కాగా రెండు వారాల క్రితం కృష్ణా జిల్లాలో మాయమైన ఆ బాలికలు (girsl missing) గుంటూరులో ప్రత్యక్షమయ్యారు. వివరాల్లోకి వెళితే.. గన్నవరం మండలం ముస్తాబాదుకు చెందిన నలుగురు బాలికలు విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజిలో చదువుతున్నారు. అంతకుముందు రెండు రోజులుగా వారు కాలేజికి వెళ్లలేదు. అక్కడి నుంచి షాపింగ్‌మాల్‌కు వెళ్లి.. అటు నుంచి షికారులు చేశారు. విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం వారిని మందలించి.. వారి తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు కూడా బాలికలను మందలించారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన వారు ఇంటి నుంచి వెళ్లిపోయారు. విషయం గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలికలు హైదరాబాదు వెళుతుండగా పిడుగురాళ్ల సమీపంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మూలవిరాట్‌ను తాకని సూర్య కిరణాలు..
సోమవారం గ్రూప్-1 ఫలితాలు విడుదల
Read Latest Telangana News and National News