ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

DHARNA: రాష్ట్రంలో కనీస వేతన బోర్డు ఏర్పాటుచేయాలి

ABN, Publish Date - May 05 , 2025 | 11:57 PM

రాష్ట్రంలో ప్రభుత్వ శాఖ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్శింగ్‌ కార్మికుల కోసం చట్టప్రకారం కనీస వేతన బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త ఆందోళన పిలుపులో భాగంగా ఆ సంఘం నాయకులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు.

Leaders protesting at the Collectorate

- కనీస వేతనం రూ.35 వేలివ్వాలి ఫ ఏఐటీయూసీ నాయకులు

అనంతపురం విద్య/టౌన, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ శాఖ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్శింగ్‌ కార్మికుల కోసం చట్టప్రకారం కనీస వేతన బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త ఆందోళన పిలుపులో భాగంగా ఆ సంఘం నాయకులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ముందుగా సంఘ మేష్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీగా చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, నగర అధ్యక్షుడు రాజేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ... దేశంలో ఒక కుటుంబం బతకాలంటే కనీసం రూ. 35 వేల వేతనం అవసరం అన్నారు. ఇదే విషయంపై ఇటీవల గోవాలో జరిగిన ఏఐటీయూసీ జాతీయ వర్కింగ్‌ కమిటీలో తీర్మానం చేసినట్లు తెలిపారు. చాలా ప్రభుత్వ శాఖల్లో వేతనాల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. వెంటనే ఏపీలో వేతన బోర్డు ఏర్పాటుచేయాలని కోరారు. అందరూ కార్మికులకు ఒకేతరహా వేతనం అందించాలన్నారు. కేంద్రంలో 8వ పీఆర్సీ, రాష్ట్రంలో 12వ పీఆర్సీ కమిటీలు వేయాల్సి ఉందన్నారు. ఆ లోగా ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రాజేష్‌గౌడ్‌, నగర ప్రధానకార్యదర్శి కృష్ణుడు, ఇతర నేతలు రామకృష్ణ, మనోహర్‌, దుర్గాప్రసాద్‌, కృష్ణానాయక్‌, నారాయణ, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 05 , 2025 | 11:57 PM