Student: రెచ్చిపోయిన కామాంధులు.. బాలికపై సామూహిక అత్యాచారం
ABN, Publish Date - Jun 06 , 2025 | 03:03 PM
విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆరుగురు యువకులు లైంగిక దాడి చేశారు. దీంతో ఆ బాలిక గర్భవతి అయింది. కానీ ఈ విషయం ఆ బాలిక తన ఇంట్లో చెప్పలేదు.
పుట్టపర్తి, జూన్ 06: తొమ్మిదో తరగతి చదువుతోన్న ఓ దళిత బాలికను పలువురు యువకులు మాయ మాటలతో మభ్యపెట్టారు. ఆ క్రమంలో ఆ బాలికపై వారు సామూహిక లైంగిక దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆ బాలిక గర్భవతి అయింది. అయితే ఆ బాలిక ఇటీవల కాలంలో తరచూ తీవ్ర అనారోగ్యానికి గురవుతోంది. దీంతో ఆమెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆమె గర్భవతి అని తెలిపారు. ప్రస్తుతం ఆ బాలికకు ఆరో నెల అని వైద్యులు వెల్లడించారు. దీంతో కుమార్తెను నిలదీయడంతో.. జరిగిన సంఘటనను తన తల్లిదండ్రులకు వివరించింది.
అనంతరం వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి మండల పరిధిలోని ఏడుగుర్రాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తల్లిదండ్రుల సమక్షంలో ఆ బాలికను పోలీసులు విచారించారు.
ఆ బాలిక చెప్పిన సాక్ష్యాల ఆధారంగా ఆరుగురిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. నిందితులంతా ఆ గ్రామ పరిసర ప్రాంతాలకు చెందిన వారేనని పోలీసులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో నిందితుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారి ఆచూకీపై పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
చినాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై సీఎం చంద్రబాబు ట్వీట్
మెడపై తుపాకీ పెట్టినా నిజాలే చెబుతా.. కమిషన్ విచారణపై ఈటెల
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 06 , 2025 | 03:09 PM