ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati: గ్లోబల్‌ గేట్‌వేగా అమరావతి వ్యాలీ

ABN, Publish Date - Jul 01 , 2025 | 02:35 AM

అమరావతిలో ప్రారంభమయ్యే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యాలీ 2035 నాటికి ప్రపంచ లైట్‌ హౌస్‌గా మారుతుందని జాతీయ వర్క్‌షాపు పేర్కొంది. క్వాంటమ్‌ టెక్నాలజీని అత్యాధునిక కంప్యూటేషన్‌కు బదలాయిస్తూ.

  • 2035 నాటికి ప్రపంచ లైట్‌ హౌస్‌!

  • స్టార్ట్‌పలకు ప్రోత్సాహకాలు

  • డిక్లరేషన్‌కు వర్క్‌షాపు ఆమోదం

అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో ప్రారంభమయ్యే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యాలీ 2035 నాటికి ప్రపంచ లైట్‌ హౌస్‌గా మారుతుందని జాతీయ వర్క్‌షాపు పేర్కొంది. క్వాంటమ్‌ టెక్నాలజీని అత్యాధునిక కంప్యూటేషన్‌కు బదలాయిస్తూ.. అమరావతి వ్యాలీని గ్లోబల్‌ గేట్‌వేగా మార్చాలని.. పెట్టుబడులు పెట్టేందుకు స్టార్ట్‌పలకు ప్రోత్సాహకాలివ్వాలని తీర్మానించింది. ఈ మేరకు డిక్లరేషన్‌ను ఆమోదించింది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ అల్గారిథమ్స్‌, క్వాంటమ్‌ సెన్సింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, క్వాంటమ్‌ మెటీరియల్‌ అండ్‌ చిప్స్‌, కెపాసిటీ బిల్డింగ్‌, సాండర్డైజేషన్‌, స్టార్ట్‌ అప్‌ ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌పై వర్క్‌షాపులో విస్తృతంగా చర్చ జరిగింది. వ్యాలీ ప్రారంభమయ్యే 2026 జనవరి 1న 100 క్వాంటమ్‌ ఆల్గారిథమ్‌లను పరీక్షిస్తారు.

2027 జనవరి 1నాటికి మూడు క్వాంటమ్‌ కంప్యూటర్లు క్యూబిట్‌ టెక్నాలజీతో, సూపర్‌ కండక్టింగ్‌ సర్క్యూట్‌తో అందుబాటులోకి వస్తాయి. 2028 జనవరి 1న 1,000 కొత్త అల్గారిథమ్స్‌ను పరీక్షిస్తారు. 2029 జనవరి 1వ తేదీనాటికి 1,000 క్యూబిట్స్‌ క్వాంటమ్‌ సామర్థ్యానికి చేరుకుంటాయి. అలాగే అమరావతిలో అకాడమీని స్థాపించాలని నిర్ణయించారు. ఇందులో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులు ఉంటాయి. 20 యూనివర్సిటీల్లో టెక్నికల్‌ సర్టిఫికేషన్‌ కోర్సులను ప్రవేశపెడతారు.

Updated Date - Jul 01 , 2025 | 02:35 AM