Virtual Workshop: ఏఐతో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ
ABN, Publish Date - May 06 , 2025 | 05:50 AM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ఫోరెన్సిక్ ఆధారాల సేకరణలో విస్తృతంగా ఉపయోగించాలని ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యూనిట్లు, వైద్యులు, దర్యాప్తు అధికారులు ప్రత్యేక శిక్షణ పొందనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలీసు, డాక్టర్లు, ఏపీపీలకు ప్రత్యేక శిక్షణ
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ఫోరెన్సిక్ ఆధారాల సేకరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగాన్ని విరివిగా తీసుకొస్తున్నామని ఏపీ పోలీ సు శాఖ స్పష్టం చేసింది. దీనిలో భాగంగా ఫోరెన్సిక్ ఆధారాల సేకరణలో మెళకువలు నేర్పేందుకు వర్చువల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించినట్టు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఈ నెల 10 వరకు నిర్వహించే ఈ వర్క్‌షా్‌పను మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి శాంతి భద్రతల ఏడీజీ ఎన్ మధుసూదన్ రెడ్డి, ఎఫ్‌ఎ్‌సఎల్ డైరెక్టర్ పాలరాజు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివిధ రకాల ఏఐ టూల్స్ అభివృద్ధి చేసి శాస్త్రీయతతోపాటు సమర్థవంతంగా ఆధారాలు సేకరించేలా తీర్చిదిద్దడమే ఈ వర్క్‌షాప్ లక్ష్యమని చెప్పారు. సోమవారం నుంచి ఈ నెల 10 వరకూ అన్ని జిల్లాల పోలీసు యూనిట్లలో ఫోరెన్సిక్ నిపుణులు ఆయా జిల్లాల్లోని దర్యాప్తు అధికారులు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, ఏపీపీలకు వారంపాటు శిక్షణ ఇస్తారన్నారు.
Updated Date - May 06 , 2025 | 05:51 AM