ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vidadala Gopi: వదిన చెబితేనే చేశా

ABN, Publish Date - May 02 , 2025 | 04:57 AM

ఎసీబీ విచారణలో భాగంగా, విడదల రజిని మరిది గోపి పేర్కొన్నాడు, వదిన చెప్పిన తర్వాతే స్టోన్‌ క్రషర్‌ యజమానికి ఫోన్‌ చేసి మాట్లాడానని. 2.2 కోట్లు వసూలు చేసి బెదిరించారని తెలిపాడు

  • స్టోన్‌ క్రషర్‌ యజమానికి ఫోన్‌ చేసి మాట్లాడా

  • నేనెవరినీ బెదిరించలేదు

  • జాషువాయే ఆయన్ను భయపెట్టారు

  • విచారణలో రజిని మరిది వెల్లడి

  • కోర్టు ఆదేశాలతో గోపీని కస్టడీకి తీసుకున్న ఏసీబీ

  • 3 రోజులపాటు విచారణ

అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి): ‘మా వదిన చెబితేనే స్టోన్‌ క్రషర్‌ యజమానికి ఫోన్‌ చేసి మాట్లాడా.. నేనెవరినీ బెదిరించలేదు.. అప్పటి గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్‌ అధికారి పల్లె జాషువాయే ఆయన్ను భయపెట్టారు..’ అని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజిని మరిది విడదల వేణుగోపీనాథ్‌ అలియాస్‌ గోపి వెల్లడించినట్లు తెలిసింది. ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలంటే అడిగింది ఇవ్వండి.. లేదంటే భారీ జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించినట్లు కూడా తెలిపారు. భారీ ఫైన్‌ వేస్తామని తనను బెదిరించి రూ.2.2 కోట్లు వసూలు చేశారని విడదల రజని, ఆమె మరిది విడదల గోపి, పీఏ రామకృష్ణ, ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువాపై చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిగలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్‌ క్రషర్‌ యజమాని నల్లపనేని చలపతిరావు ఫిర్యాదుతో వారిపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.


ఈ బాగోతంలో కీలక పాత్ర పోషించిన గోపి(ఏ-3)ని ఏసీబీ అధికారులు ఇటీవల హైదరాబాద్‌లో అరెస్టు చేయగా.. విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌కు పంపింది. అనంతరం మూడ్రోజులు కస్టడీలో విచారించేందుకు అనుమతించింది ఏసీబీ అధికారులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయం తనకేమీ తెలియదన్న గోపి.. అధికారులు ఆధారాలు ముందుపెట్టడంతో నోరు విప్పారు. వదిన చెప్పడంతోనే స్టోన్‌ క్రషర్‌ యజమానికి ఫోను చేసినట్లు అంగీకరించారని తెలిసింది. మరో రెండ్రోజులు ఆయన్ను ప్రశ్నించనున్నారు.

Updated Date - May 02 , 2025 | 04:57 AM