ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls: ఎంతిద్దాం.. ఎప్పుడిద్దాం.. నియోజకవర్గ ఇన్‌చార్జిలతో అభ్యర్థుల చర్చలు

ABN, Publish Date - Apr 25 , 2024 | 10:58 AM

పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. నేటితో ఆ ప్రక్రియ ముగియనుంది. దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతోపాటు ఓటర్లకు డబ్బులు పంచేందుకు తగిన వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు.

- రూ.1000 నుంచి 1500 వరకు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్న నాయకులు

- గిఫ్టులు సైతం అందజేయాలని సూచనలు

- స్థానిక నాయకులు చెప్పినట్టు నడుచుకుంటున్న అభ్యర్థులు

ఓటర్లకు తాయిలాల పంపిణీపై అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఎప్పుడు పంచాలి.. ఎవరికి ఎంత ఇవ్వాలని లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జి(Constituency Incharge)లతో చర్చిస్తున్నారు. అలాగే.. పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలను కార్యకర్తలకు, నేతలకు తెలియజేస్తున్నారు. వారి సలహాలను, సూచనలను తీసుకుని ఆ విధంగానే అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు.

హైదరాబాద్‌ సిటీ: పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. నేటితో ఆ ప్రక్రియ ముగియనుంది. దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతోపాటు ఓటర్లకు డబ్బులు పంచేందుకు తగిన వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ మేరకు తాము పోటీచేస్తున్న పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇన్‌చార్జిలతో సమావేశమవుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఎంత మందికి నగదు పంపిణీ చేయాలి, ఇస్తే ఎంత మంది ఓట్లు వేస్తారనే దానిపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ పరిధిలోని మొత్తం ఓట్లలో కనీసం 70 శాతం మందికి డబ్బులు ఇస్తే.. అందులో 50 శాతం ఓట్లు మనకు పడే అవకాశాలుంటాయని నాయకులు చెబుతుండడంతో అంత మొత్తాన్ని పంపిణీ చేయడం సాధ్యమవుతుందా.. అనేదానిపై గుబులు పడుతున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ప్రచారం హోరెత్తేలా.. ప్రణాళికలు రచిస్తున్న అభ్యర్థులు

పోలింగ్‌కు రెండు రోజుల ముందే..

నగదు పంపిణీ కార్యక్రమాన్ని తప్పనిసరిగా పోలింగ్‌కు రెండు రోజుల ముందు ప్రారంభించి ముగించాలని నాయకులు సూచిస్తున్నారు. నగదు ఇచ్చిన ఓటర్లను పోలింగ్‌ రోజున కేంద్రాల వద్దకు జాగ్రత్తగా తీసుకెళ్లి వారితో ఓట్లు వేయించుకోవాలని చెబుతున్నారు. లేకుంటే డబ్బులు తీసుకున్న వారు ఇంటికే పరిమితమవుతారని భావిస్తున్నారు. ఎన్నికల్లో ప్రచారం ఒక ఎత్తయితే.. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం, ఇచ్చిన వారిని కేంద్రాలకు తీసుకెళ్లి ఓట్లు వేయించుకోవడం మరో ఎత్తని, వీటన్నింటిని పరిగణలోకి ముందుకుసాగితేనే గెలిచే అవకాశాలుంటాయని నాయకులు పేర్కొంటున్నారు.

రూ. 500 కంటే ఎక్కువ ఇవ్వలేం..

గత అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల నుంచి పోటీచేసిన అభ్యర్థులు ఓటుకు రూ.1500 వరకు ఇచ్చారు. మరికొన్ని చోట్ల రూ.2వేల నుంచి రూ.3 వేలు వరకు కూడా ఇచ్చారు. అపార్ట్‌మెంట్‌వాసులకు, గేటెడ్‌ కమ్యూనిటీలకు ప్రత్యేక నజరానాలు అందించారని నాయకులు గుర్తుచేస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటుకు రూ.1000-1500 వరకు కచ్చితంగా ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే ఓటుకు రూ.500 కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి తమ వద్ద లేదని కొన్ని పార్టీల అభ్యర్థులు నాయకుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: Lok Sabha Polls: రాజాసింగ్‌ డుమ్మా వెనుక ఉన్న మతలబు ఏమిటో..?

Read Latest National News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 11:18 AM

Advertising
Advertising