ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Padi koushik Reddy: మేము గేట్లు ఎత్తితే మీరు భూ స్థాపితమే..

ABN, Publish Date - Mar 18 , 2024 | 01:47 PM

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ ఉన్నారు.

హైదరాబాద్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ను కలిసి దానం నాగేందర్‌ (Daanam Nagendar)పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy), ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ ఉన్నారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దానం నాగేందర్ ను డిస్ క్వాలి ఫై చేయాలని స్పీకర్ ను కలిసి పిటిషన్ ఇచ్చామన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటా అన్నారని తెలిపారు.

Chandrababu: చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్.. కారణమేంటంటే..

ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్న విషయాన్ని ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిని రాళ్లతో కొడతారా? అని ప్రశ్నించారు. దానంను బీడీలు అమ్ముకునే వారని రేవంత్ అన్నారని.. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఉందని.. రేవంత్ రెడ్డి మీరు కొట్టారు మేం తీసుకున్నాం.. ఇక మేము కొట్టినప్పుడు మీరు లేవలేరని తెలిపారు. మేము గేట్లు ఎత్తినప్పుడు మీరు భూ స్థాపితం అవుతారని రేవంత్‌ను పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

Tamilisai: తమిళిసై రాజీనామాకు కారణాలేంటి?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 18 , 2024 | 01:47 PM

Advertising
Advertising