ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KCR: బాబోయ్.. కేసీఆర్ ఇంటివద్ద క్షుద్ర పూజలు..!

ABN, Publish Date - Apr 17 , 2024 | 11:56 AM

KCR House at Nandi Nagar: తెలంగాణ(Telangana) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఇంటి సమీపంలో క్షుద్రపూజలు(Black Magic) కలకలం రేపాయి. కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈ క్షుద్రపూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందినగర్‌లోని(Nandi Nagar) కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది.

Black magic near KCRs house

KCR House at Nandi Nagar: తెలంగాణ(Telangana) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఇంటి సమీపంలో క్షుద్రపూజలు(Black Magic) కలకలం రేపాయి. కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈ క్షుద్రపూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందినగర్‌లోని(Nandi Nagar) కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళ క్షుద్ర పూజలు నిర్వహించారు. అక్కడి దృశ్యాలు గమనిస్తే చేతబడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. బొమ్మ, చిన్న విస్త్రాలు, కుంకుమ, పసుపు, నిమ్మకాయ, కోడిగుడ్డు, వెంట్రుకలు, ఇతర వస్తువులు ఉన్నాయి. ఇది గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


వైరల్ అవుతున్న వీడియో..

కాగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో నవీన పేరుతో ఉన్న అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. ‘ఈ పోస్టులో ‘కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్ర పూజలు. నందినగర్‌లోని కేసీఆర్ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు.’ అని పేర్కొన్నారు. ఆ ఖాళీ స్థలంలో క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లను వీడియో తీసి పోస్ట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 11:56 AM

Advertising
Advertising