ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mohit Sharma: ఐపీఎల్ చరిత్రలోనే.. మోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డ్

ABN, Publish Date - Apr 25 , 2024 | 07:18 AM

ఈ ఐపీఎల్-2024 సీజన్ బౌలర్లకు పీడకలగా మారిందని చెప్పుకోవచ్చు. ఎంత బాగా బౌలింగ్ వేసినా బ్యాటర్లను కట్టడి చేయలేకపోతున్నారు. హేమాహేమీలు సైతం భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పరిస్థితి నెలకొంది. బ్యాటింగ్‌కి అనుకూలంగా పిచ్‌లు ఉండటమే..

Mohit Sharma Creates Worst Record In IPL

ఈ ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్ బౌలర్లకు పీడకలగా మారిందని చెప్పుకోవచ్చు. ఎంత బాగా బౌలింగ్ వేసినా బ్యాటర్లను కట్టడి చేయలేకపోతున్నారు. హేమాహేమీలు సైతం భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పరిస్థితి నెలకొంది. బ్యాటింగ్‌కి అనుకూలంగా పిచ్‌లు ఉండటమే అందుకు కారణం. ఈ క్రమంలోనే.. బౌలర్ల పేరిట చెత్త రికార్డుల నమోదవుతున్నాయి. తాజాగా గుజ‌రాత్ టైటాన్స్ (Gujarat Titans) పేస‌ర్ మోహిత్ శ‌ర్మ (Mohit Sharma) ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డ్‌ని నెలకొల్పాడు. ఒక స్పెల్‌లో (నాలుగు ఓవర్లు) అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు.


టీ20 వరల్డ్ కప్ జట్టులో ఆ ఇద్దరికీ నో ప్లేస్.. ఈ 15 మంది సెట్!

ఐపీఎల్‌-2024లో భాగంగా.. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మోహిత్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో.. ఐపీఎల్‌లో ఒక స్పెల్‌లో భారీగా ఇచ్చిన బౌలర్‌గా మోహిత్ చెత్త రికార్డ్‌ని తన పేరిట లిఖించుకోవాల్సి వచ్చింది. అంతకముందు ఈ రికార్డ్ బాసిల్ థంపి పేరిట ఉండేది. 2018లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆ సన్‌రైజర్స్ బౌలర్లు తన నాలుగు ఓవర్ల కోటాలో 70 పరుగులిచ్చాడు. ఇప్పుడు మోహిత్ దాన్ని అధిగమించి, చెత్త రికార్డ్‌ని మూటగట్టుకున్నాడు. నిజానికి.. మోహిత్ తొలి రెండు ఓవర్లు బాగానే వేశాడు కానీ, ఆ తర్వాతి రెండు ఓవర్లలో చేతులెత్తేశాడు. ముఖ్యంగా.. మ్యాచ్‌లో 20వ ఓవర్ వేసిన మోహత్ అక్షరాల 31 పరుగులు ఇచ్చుకున్నాడు. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ 4 సిక్సులు, ఒక ఫోర్‌తో ఊచకోత కోసి 31 పరుగులు రాబట్టాడు.

టీ20 వరల్డ్ కప్‌లో ఎంఎస్ ధోనీ వైల్డ్ కార్డ్ ఏంట్రి..?

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (88) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించడం, అక్షర్ పటేల్ (66) అర్థశకతంతో చెలరేగడంతో పాటు చివర్లో స్టబ్స్ (26) మెరుపులు మెరిపించడంతో.. ఢిల్లీ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేధనలో భాగంగా గుజరాత్ చివరివరకూ గట్టిగానే పోరాడింది కానీ, దురదృష్టవశాత్తూ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో జీటీ 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. తమ జట్టుని గెలిపించుకోవడం కోసం సాయి సుదర్శన్ (65), డేవిడ్ మిల్లర్ (55), రషీద్ ఖాన్ (21) గట్టిగానే పోరాడారు కానీ ఫలితం లేకుండా పోయింది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 08:08 AM

Advertising
Advertising