Share News

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ జట్టులో ఆ ఇద్దరికీ నో ప్లేస్.. ఈ 15 మంది సెట్!

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:01 PM

టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. సెలక్టర్లు భారత జట్టుని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. మాజీ ఆటగాళ్లు జట్టులో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? ఎవరిని ఏ స్థానంలో దింపాలి?

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ జట్టులో ఆ ఇద్దరికీ నో ప్లేస్.. ఈ 15 మంది సెట్!
Two Big Names Dropped From India T20 World Cup Squad

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) సమీపిస్తున్న తరుణంలో.. సెలక్టర్లు భారత జట్టుని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. మాజీ ఆటగాళ్లు జట్టులో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? ఎవరిని ఏ స్థానంలో దింపాలి? అనే విషయాలపై తమదైన సూచనలు ఇస్తున్నారు. అలాగే.. తమ అంచనాలతో కూడిన జట్లను సైతం ప్రకటిస్తున్నారు.

Viral Video: ఆధార్ కార్డ్ కోసం పరుగు తీసిన స్టార్ క్రికెటర్

ఇప్పటికే సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఓపెనర్లుగా ఎవరిని బరిలోకి దింపాలన్న విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకోగా.. తాజాగా ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన జట్టును వెల్లడించాడు. 15 మందితో కూడిన జట్టుని ప్రకటించిన ఈ మాజీ ఆటగాడు.. టాపార్డర్ దగ్గర నుంచి పేస్ బౌలర్ల దాకా.. ఎవరెవరికి ఎక్కడెక్కడ చోటు కల్పిస్తానన్న వివరాల్ని కూడా పంచుకున్నాడు. టాపార్డర్‌లో భాగంగా.. రోహిత్ శర్మ (Rohit Sharma), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ (Virat Kohli), శుభ్‌మన్‌ గిల్‌ ఉంటారని చెప్పాడు. యశస్వీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభిస్తాడని, కోహ్లీ వన్‌డౌన్‌లో వస్తాడని, ఇక శుభ్‌మన్ గిల్ బ్యాకప్‌గా ఉంటాడని అన్నాడు.

Dhoni Viral Video: కెమెరామెన్‌ను బెదిరించిన ధోనీ.. ఎందుకంటే..


మిడిలార్డర్‌లో పోటీ బాగానే ఉందని.. తాను సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్, రింకు సింగ్‌, శివమ్‌ దూబేలకు అవకాశం ఇస్తానని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. ఏకైక పేస్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యాకే జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా రిషభ్ పంత్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడన్నాడు. ఫైనల్‌గా స్పిన్, పేస్ బౌలర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉంటాడని, స్పిన్ భాగంలో చాహల్‌తో పాటు కుల్దీప్ యాదవ్‌లకు చోటు కల్పిస్తానని తెలిపాడు. పేస్ విభాగంలో షమీ రాకపోతే.. బుమ్రాకు తోడుగా సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ కలిపి పేస్ ఎటాక్‌ను నడిపిస్తారని చెప్పుకొచ్చాడు.

మార్కస్ స్టోయినిస్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌ల పేర్లను మాత్రం ఇర్ఫాన్ ప్రస్తావించలేదు. వికెట్ కీపర్‌గా కేవలం రిషభ్ పంత్‌ని మాత్రం ఎంపిక చేశాడు. అలాగే.. శ్రేయస్ అయ్యర్ అతని జట్టులో మిస్ అవ్వడం గమనార్హం. ఇర్ఫాన్ ప్రకటించిన 15 మంది సభ్యుల టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, రింకు సింగ్, శివమ్‌ దూబె, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్

Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 04:18 PM