ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఈ జొమాటో డెలివరీ బాయ్‌ స్పెషాలిటీయే వేరు.. జంక్షన్‌లో అతన్ని చూసి అవాక్కైన వాహనదారులు..

ABN, Publish Date - Apr 17 , 2024 | 03:44 PM

చేసేది ఎలాంటి పని అయినా.. కొందరు అందులో తమ ప్రత్యేకతను చాటుకుంటుంటారు. ఏదో ఒక విషయంలో మిగతా వారికి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా...

చేసేది ఎలాంటి పని అయినా.. కొందరు అందులో తమ ప్రత్యేకతను చాటుకుంటుంటారు. ఏదో ఒక విషయంలో మిగతా వారికి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జంక్షన్‌లో ఓ జొమాటో డెలివరీ బాయ్ ఆగగానే అంతా అతడిని విచిత్రంగా చూశారు. ఇంతకీ ఈ డెలివరీ బాయ్‌ స్పెషాలిటీ ఏంటో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జొమాటో డెలివరీ బాయ్‌లకు (Zomato Delivery Boy) సంబంధించిన అనేక వీడియోలను తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో జొమాటో డెలివరీ బాయ్‌ను చూసి అంతా అవాక్కవుతున్నారు. బైకుపై వచ్చిన డెలివరీ బాయ్.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగాడు. అంతా అతన్ని విచిత్రంగా చూశారు. అంత స్పెషల్ ఏముందబ్బా.. అని మరికొందరు అతన్ని తీక్షణంగా పరిశీలించారు.

Viral Video: వావ్..! పనిని ప్రేమించడం అంటే ఇదే.. ఈ పనిని ఇలా చేయడం ఎవరికీ సాధ్యం కాదేమో..

చివరగా, అతడి బైకు వైపు చూసి షాక్ అయ్యారు. డెలివరీ పని చేసే అతను.. ఏకంగా రూ.2లక్షలకు పైగా విలువ చేసే (హార్లే-డేవిడ్‌సన్ X440) బైకుపై రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అక్కడ ఉన్నది.. జొమాటో వ్యవస్థాపకుడు దీపందర్ గోయల్ కావచ్చు’’.. అంటూ కొందరు, ‘‘ఇతనెవరో టైం పాస్ కోసం ఈ జాబ్ చేస్తున్నట్లు ఉన్నాడు’’.. అంటూ మరికొందరు, ‘‘ హార్లే-డేవిడ్‌సన్ బైక్ అయినా సైకిల్‌పై అయినా.. డెలివరీ బాయ్‌ల కృషి మరువలేనది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వామ్మో..! ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. ఆటోలో వెళ్తూ బైకర్‌కు షాకిచ్చిన మహిళ.. చివరకు..

Updated Date - Apr 17 , 2024 | 03:44 PM

Advertising
Advertising