Share News

Viral Video: వావ్..! పనిని ప్రేమించడం అంటే ఇదే.. ఈ పనిని ఇలా చేయడం ఎవరికీ సాధ్యం కాదేమో..

ABN , Publish Date - Apr 16 , 2024 | 09:03 PM

కొందరు తమ పని పట్ల అంతికభావంతో ఉంటారు. చేసే పని చిన్నదా లేక పెద్దదా అని చూడకుండా.. ఆ పనిని ఎంతో ప్రేమగా చేస్తుంటారు. మరికొందరు. అంతా సాధారణంగా చేసే పనులను వినూత్రంగా చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video: వావ్..! పనిని ప్రేమించడం అంటే ఇదే.. ఈ పనిని ఇలా చేయడం ఎవరికీ సాధ్యం కాదేమో..

కొందరు తమ పని పట్ల అంతికభావంతో ఉంటారు. చేసే పని చిన్నదా లేక పెద్దదా అని చూడకుండా.. ఆ పనిని ఎంతో ప్రేమగా చేస్తుంటారు. మరికొందరు. అంతా సాధారణంగా చేసే పనులను వినూత్రంగా చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చేస్తున్న పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ పనిని ఇలా చేయడం ఎవరికీ సాధ్యం కాదేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి భవనం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కుర్చీలను వేస్తుంటాడు. చేసేది చిన్న పనే అయినా అతడు ఆ పని చేస్తున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. డజన్ల కొద్దీ ఉన్న కుర్చీల (Dozens of chairs) సెట్‌ను అక్కడికి లాక్కొస్తాడు. తర్వాత సెట్ నుంచి ఒక్కొక్క కుర్చీని బయటికి తీసి ఖాళీ స్థలంలో వరుసగా వేశాడు. అయితే ఇక్కడ తన పనితనాన్ని బయటపెట్టాడు. సెట్ నుంచి ఒక్కో కుర్చీని ఇలా పీకేసి, స్టైల్‌గా దూరంగా విసురేస్తాడు. అది కాస్త లైన్‌గా వెళ్లి ఆగుతుంది.

Puzzle: ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో ఉన్న 3 తేడాలను.. 30 సెకన్లలో కనిపెట్టగలరా..?

ఇలా విసిరేసిన కుర్చీలన్నీ అక్కడ ఒకదాని ఒకటిగా వరుసగా పేర్చబడతాయి. ఇలా క్షణాల్లో ఆ స్థలంలో కుర్చీలను పేర్చేస్తాడు. ఇతడి పనితనం చూసి అక్కడున్న వారు అవాక్కవుతున్నారు. వెంటనే ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! ఇతడి స్టైల్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పని పట్ల శ్రద్ధ వహించడం అంటే ఇదే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మాంసం తింటుండగా పులి నోట్లో ఇరుక్కున్న ఎముక.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - Apr 16 , 2024 | 09:03 PM