Share News

Viral Video: కొంపతీసి ఇది కొత్త ట్రెండ్ కాదు కదా.. సెలూన్ షాప్‌లో ఈమె చేస్తున్న పని చూడండి..

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:21 PM

ప్రస్తుతం యువత ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే తమ అందానికి మరింత మెరుగులు దిద్దేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి ..

Viral Video: కొంపతీసి ఇది కొత్త ట్రెండ్ కాదు కదా.. సెలూన్ షాప్‌లో ఈమె చేస్తున్న పని చూడండి..

ప్రస్తుతం యువత ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే తమ అందానికి మరింత మెరుగులు దిద్దేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సెలూన్ షాప్‌లో యువతి చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఈ యువతి కొత్త ట్రెండ్‌కు తెర తీసిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman in salon shop) సెలూన్‌లోకి వెళ్లింది. నేరుగా కుర్చీలో కూర్చుని తనకు సేవ్ చేయాలని చెప్పింది. దీంతో సెలూన్ షాపు నిర్వాహకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చివరకు ఆమె కోరుకున్న విధంగా మగవాళ్ల తరహాలోనే ఆమె మొఖానికి క్రీమ్ పూసి సేవ్ చేశాడు. సేవింగ్ పూర్తవగానే అక్కడి నుంచి వెళ్లిపోయిన యువతిని.. చుట్టు పక్కల వారంతా విచిత్రంగా చూశారు.

Watch Video: అరటిపండ్లతో ఇలాంటి వ్యాపారం ఎక్కడైనా చూశారా.. తొక్క తీసి చూడగా పండు మధ్యలో..

సాధారణానికి భిన్నంగా యువతి షేవింగ్ చేయించుకోవడంతో వారంతా ఆమెను వింతగా చూశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమెంటీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇది కొత్త ట్రెండేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక.. సడన్‌గా లోపలికి వచ్చిన కోతులు. చివరకు ఆమెకు వచ్చిన ఐడియాతో..

Updated Date - Apr 14 , 2024 | 03:21 PM