Share News

Wife: భార్య పక్కన మేనమామను అసభ్యకర స్థితిలో చూసిన భర్త.. 22 ఏళ్ల తర్వాత సడన్‌గా.. అతన్ని ఇంటికి పిలిచి మరీ..

ABN , Publish Date - Apr 12 , 2024 | 07:42 PM

దంపతుల మధ్య చాలా విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి. అయితే ఆ వెంటనే మళ్లీ సర్దుకుపోతుంటారు. అయితే అదే దంపతుల మధ్య వివాహేతర సంబంధాల విషయంలో తలెత్తే గొడవలు కొన్నిసార్లు చాలా దూరం వెళ్తుంటాయి. భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త చేసే పనులు.. చివరకు...

Wife: భార్య పక్కన మేనమామను అసభ్యకర స్థితిలో చూసిన భర్త.. 22 ఏళ్ల తర్వాత సడన్‌గా.. అతన్ని ఇంటికి పిలిచి మరీ..
ప్రతీకాత్మక చిత్రం

దంపతుల మధ్య చాలా విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి. అయితే ఆ వెంటనే మళ్లీ సర్దుకుపోతుంటారు. అయితే అదే దంపతుల మధ్య వివాహేతర సంబంధాల విషయంలో తలెత్తే గొడవలు కొన్నిసార్లు చాలా దూరం వెళ్తుంటాయి. భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త చేసే పనులు.. చివరకు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తుంటాయి. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, రాజస్థాన్‌లో ఈ తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. భార్య పక్కన తన మేనమామను అసభ్యకర రీతిలో చూసి భర్త.. 22 ఏళ్ల తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ (Rajasthan) బరాన్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. స్థానిక బమ్లా గ్రామంలో రాధేశ్యామ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి 22 ఏళ్ల క్రితమే వివాహమైంది. అయితే వివాహమైన కొత్తల్లో రాధే శ్యామ్ మేనమామ ఫూల్ చంద్ మాలి (50) తరచూ వీరి ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో రాధే శ్యామ్ భార్యతో చనువుగా ఉండేవాడు. మేన మామే కావడంతో రాధే శ్యామ్ కూడా పట్టించుకునేవాడు కాదు. అయితే ఓ రోజు తన భార్య పక్కన ఫూల్ చంద్.. అసభ్యకర స్థితిలో ఉండడం చూసి షాక్ అయ్యాడు. అప్పటి నుంచి భార్యను పల్లెత్తుమాట కూడా అనకుండా.. మేనమామపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకునేవాడు.

Viral Video: పడుకున్న ఆవులను హింసించాడు.. చూస్తుండగానే అతడికి ఎలాంటి ఫలితం దక్కిందో చూస్తే..

ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన సమయం కోసం వేచి చూసే క్రమంలో ఏళ్లు గడిచిపోయాయి. తీరా 22 ఏళ్ల తర్వాత ఇటీవల అతడికి ఆ అవకాశం వచ్చింది. గత శనివారం తన ఇంట్లో ఫంక్షన్ ఉందని, ఇంటికి రావాలని మేనమామను పిలిచాడు. రాత్రి ఇంటికి వచ్చిన ఫూల్ చంద్‌పై రాధే శ్యామ్ (attack on uncle) విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లి, గ్రామ పరిసరాల్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మరుసటి రోజు ఉదయం సగం కాలిన మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి మొఖంపై గాయాలు ఉండడం చూసి పోలీసులకు అనుమానం కలిగింది. చివరకు రాధే శ్యామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Optical Illusion: పిల్లలు ఆడుకుంటున్న ఈ బీచ్‌లో ఓ అయస్కాంతం దాక్కుని ఉంది.. ఎవరైనా కనిపెట్టగలరా..

Updated Date - Apr 12 , 2024 | 07:42 PM