Share News

Viral Video: కొమొడో డ్రాగన్‌తో సై అంటే సై అన్న దున్నపోతు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Apr 11 , 2024 | 09:20 PM

కొమొడో డ్రాగన్లు ఎంత ప్రమాదకరమైన జంతువులో అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద జింకలు, గేదెలపై అవలీలగా దాడి చేసి చూస్తుండగానే మింగేస్తుటాయి. కొన్నిసార్లు పులులు, సింహాలు వంటి ప్రమాదకర జంతువులపై కూడా దాడికి దిగుతుంటాయి. ఇలాంటి..

Viral Video: కొమొడో డ్రాగన్‌తో సై అంటే సై అన్న దున్నపోతు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

కొమొడో డ్రాగన్లు ఎంత ప్రమాదకరమైన జంతువులో అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద జింకలు, గేదెలపై అవలీలగా దాడి చేసి చూస్తుండగానే మింగేస్తుటాయి. కొన్నిసార్లు పులులు, సింహాలు వంటి ప్రమాదకర జంతువులపై కూడా దాడికి దిగుతుంటాయి. ఇలాంటి ఫాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ దున్నపోతు కొమొడో డ్రాగన్‌లో యుద్ధానికి దిగింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అటవీ ప్రాంతంలోని విశాల ప్రదేశంలో కొన్ని గేదెలు (buffalo) గడ్డి మేస్తుంటాయి. అదే సమయంలో ఆకలితో ఉన్న ఓ కొమొడో డ్రాగన్.. దూరం నుంచి వాటిని గమనిస్తుంది. అదును చూసి గేదెల మందపై ఎటాక్ చేస్తుంది. వాటిలో ఓ చిన్న గేదెను నోట కరుచుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయితే కొమొడో డ్రాగన్ రాకను గమనించిన గేదెలన్నీ దూరంగా పరుగులు పెడతాయి. అయినా కొమొడో మాత్రం వాటిని వేటాడాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో దాన్ని దూరంగా తరిమికొట్టేందుకు ఓ దున్నపోతు ముందుకొస్తుంది. పరుగు పరుగున అక్కడికి వచ్చి ( buffalo attacked the Komodo dragon) కొమొడోపై కొమ్ములతో విరుచుకుపడుతుంది.

Viral Video: ఎస్కలేటర్ ఎక్కుతున్నారా.. అయితే ఇలాంటి తప్పు మాత్రం చేయకండి..

దున్నపోతును చూడగానే కొమొడో డ్రాగన్ కూడా భయపడి.. దూరంగా పారిపోయి ఆగిపోతుంది. దాన్ని అక్కడి నుంచి పంపించాలని దున్నపోతు, ఎలాగైనా వాటిపై దాడి చేయాలని కొమొడో అక్కడే పొంచి ఉంటాయి. కొమొడో వైపు ఆగ్రహంతో చూసి దున్నపోతు.. ‘‘చివరిసారిగా చెబుతున్నా.. ఇక్కడి నుంచి వెళ్లిపో.. లేదంటే నా చేతుల్లో చస్తావ్’’.. అన్నట్లుగా దాన్ని హెచ్చరిస్తుంది. ఈ క్రమంలో దున్నపోతుపై దాడి చేయాలని చూసిన కొమొడోపై మళ్లీ కొమ్ములతో ఎదురుదాడి చేస్తుంది. దీంతో భయంతో కొమొడో.. దూరంగా పారిపోతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దున్నపోతుతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి వేదికపై ఐ ఫోన్ అన్‌బాక్స్ చేసిన వరుడు.. చివరికి అందరికీ ఎలాంటి షాక్ ఇచ్చాడంటే..

Updated Date - Apr 11 , 2024 | 09:20 PM