Share News

Viral Video: ఇదో కొత్త రకం చోరీ.. ఈ మహిళపై చేసిన ప్రయోగం చివరికి ఏమైందో మీరే చూడండి..

ABN , Publish Date - Apr 10 , 2024 | 08:24 PM

ఓ వైపు టెక్నాలజీ రోజురోజుకూ ఎంతో అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు నేరాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. కొందరు నేరస్థులు టెక్నాలజీ సాయంతో ఇంట్లో కూర్చునే నేరాలకు పాల్పడుతుంటే.. మరికొందరు పోలీసులకు దొరక్కుండా అత్యంత తెలివిగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి...

Viral Video: ఇదో కొత్త రకం చోరీ.. ఈ మహిళపై చేసిన ప్రయోగం చివరికి ఏమైందో మీరే చూడండి..

ఓ వైపు టెక్నాలజీ రోజురోజుకూ ఎంతో అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు నేరాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. కొందరు నేరస్థులు టెక్నాలజీ సాయంతో ఇంట్లో కూర్చునే నేరాలకు పాల్పడుతుంటే.. మరికొందరు పోలీసులకు దొరక్కుండా అత్యంత తెలివిగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చోరీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు చేసిన వినూత్న చోరీ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఓ మహిళ చేతిపై సెంట్ పూసి చివరకు ఏం చేశాడో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) దుకాణంలో కూర్చుని ఉండగా.. ఓ యువకుడు ఆమె వద్దకు వెళ్తాడు. ‘‘రూ.5వేలు ఫోన్ పే (PhonePe) చేస్తా.. క్యాష్ కావాలి’’ అడుగుతాడు. అందుకు ఆమె అలాగే ఇస్తా కానీ.. రూ.50లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని అడుగుతుంది. అందుకే ఆ యువకుడు కూడా అంగీకరిస్తాడు. దీంతో ఆమె తన ర్యాక్‌లో ఉన్న ఐదు వేల నోట్లను బయటికి తీసి, కౌంట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో సదరు వ్యక్తి ఆమెతో తనకు పెర్ఫ్యూమ్ (Perfume) కావాలని అడుగుతాడు. అందుకు ఆమె సరే అని చెబుతుంది. అయితే ఇక్కడే సదరు యువకుడు తన తెలివిని ప్రదర్శించాడు. తనకు ఎలాంటి పెర్ఫ్యూమ్ కావాలో ఆమెకు వివరిస్తూ.. తన వెంట తెచ్చుకున్న పెర్ఫ్యూమ్ బాటిల్‌తో ఆమె చేతిపై కొంత స్ప్రే చేస్తాడు.

Viral Video: ఇదిగో ఇందుకే.. పులులు, సింహాలకు సైతం ఏనుగంటే చచ్చేంత భయం..

ఆ పరిమళాన్ని వాసన చూసిన మహిళ.. ‘‘ఇలాంటి పెర్ఫ్యూమ్ కూడా ఉంది’’.. అని చెబుతుంది. అయితే ఆ వెంటనే ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. కుర్చీలో కూర్చున్న ఆమె అలాగే నిద్రలోకి జారుకుంటుంది. తర్వాత సదరు యువకుడు ఎంతో తాపీగా ఆమె చేతిలోని డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది అవగాహన కోసం చేసినట్లుగా ఉన్నా.. ఇలాంటి చోరీలు కూడా జరుగుతున్నాయి’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో..! ఇలాక్కూడా జరుగుతుందా’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 10న షేర్ చేసిన ఈ వీడియో.. వార్త రాస్తున్న సమయానికి 1500కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇవి కదా తెలివితేటలు అంటే.. పైనాపిల్స్ సేల్స్ పెంచేందుకు ఇతడు వాడిన టెక్నిక్ తెలిస్తే..

Updated Date - Apr 10 , 2024 | 08:24 PM