Share News

Viral Video: సెల్ఫీ తీసుకుంటుండగా మహిళకు వింత అనుభవం.. క్షణాల వ్యవధిలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు చూస్తే..

ABN , Publish Date - Apr 10 , 2024 | 04:23 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సెల్ఫీల పిచ్చి పట్టుకుంది. కొందరు క్షణ క్షణానికి తమ దినచర్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే ఈ కంగారులో పడి కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి...

Viral Video: సెల్ఫీ తీసుకుంటుండగా మహిళకు వింత అనుభవం.. క్షణాల వ్యవధిలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సెల్ఫీల పిచ్చి పట్టుకుంది. కొందరు క్షణ క్షణానికి తమ దినచర్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే ఈ కంగారులో పడి కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు ఎదురురైన షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ సెల్ఫీ తీసుకుంటుండగా.. షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) కారులో ఎక్కడికో వెళ్తుంటుంది. అయితే మార్గమధ్యలో ఆమె తన ప్రయాణానికి సంబంధించిన సెల్ఫీలను (Selfie) తీసుకోవాలని అనుకుంది. దీంతో చేయి బయటికి పెట్టి.. ఫోన్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ కారు అత్యంత వేగంగా వెళ్తుండడంతో గాలి దాటికి ఫోన్ చేతిలోకి ఎగిరిపోయి రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమె ఉన్నట్టుండి షాక్ అయింది.

Viral Video: ఒకే గుంతలో ఇరుక్కుపోయిన పాము, ముంగిస.. చివరకు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

వెంటనే కారు ఆపమంటూ కేకలు పెట్టింది. అప్పటికే కారు వేగంగా వెళ్తుండడంతో అదుపు చేసేందుకు చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో వారు చాలా దూరం ముందుకు వచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సెల్ఫీల పిచ్చి వల్ల చివరకు ఎంత నష్టం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘అరే..! శత్రవులకైనా ఇలాంటి సమస్య రాకూడదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical illusion: ఈ రెండు చిత్రాల్లో దాగున్న 3 తేడాలను గుర్తిస్తే.. మీలో ఏకాగ్రత మెండుగా ఉన్నట్లే..

Updated Date - Apr 10 , 2024 | 04:23 PM