Share News

Optical illusion: ఈ బేకరీలో దాక్కుని ఉన్న మొఖాలను గుర్తించండి చూద్దాం..

ABN , Publish Date - Apr 09 , 2024 | 07:06 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో కొన్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని ఆలోచింపజేస్తుంటాయి. ఫైనల్‌గా ఇలాంటి ఫొటోలన్నీ కాలక్షేపాన్ని ఇవ్వడంతో పాటూ మెడదకు మంచి వ్యాయామంలా కూడా ఉపయోగపడతాయి. సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలు నిత్యం అనేకం దర్శనమిస్తుంటాయి. తాజాగా...

Optical illusion: ఈ బేకరీలో దాక్కుని ఉన్న మొఖాలను గుర్తించండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో కొన్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని ఆలోచింపజేస్తుంటాయి. ఫైనల్‌గా ఇలాంటి ఫొటోలన్నీ కాలక్షేపాన్ని ఇవ్వడంతో పాటూ మెడదకు మంచి వ్యాయామంలా కూడా ఉపయోగపడతాయి. సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలు నిత్యం అనేకం దర్శనమిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక్కడ కనిపిస్తున్న బేకరీలో కొన్ని మొఖాలు దాక్కుని ఉన్నాయి. అవెక్కడున్నాయో కనుక్కోండి చూద్దాం.

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఒక్కడ కనిపిస్తున్న బేకరీ వద్ద ఓ వ్యక్తి తన కొడుకును ఎత్తుకుని ఉన్నాడు. బేకరీలోని కేక్‌లు చూస్తున్న పిల్లాడు.. తనకు ఇష్టమైన కేక్‪ను తన తండ్రికి చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ మీ కంటికో పరీక్ష పెడుతున్నాం. ఈ బేకరీలో చాలా రకాల కేక్‌లను మీరు చూస్తున్నారు కదా.. అయితే ఇందులోనే కొన్ని మొఖం ఆకారాలు (Hidden face shapes) కూడా దాక్కుని ఉన్నాయి. అవన్నీ కేక్‌లలో కలిసిపోయాయి. కాస్త తీక్షణంగా పరిశీలిస్తే తప్ప వాటిని కనుక్కోవడం కష్టం అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం ఆ మొఖాలు ఎక్కడెక్కడ దాక్కున్నాయో కనుక్కోండి మరి. ఒకవేళ ఇప్పటికీ వాటిని గుర్తించడం మీకు కష్టంగా అనిపిస్తే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral-phot.jpg

Updated Date - Apr 09 , 2024 | 07:06 PM