Share News

Viral Video: పార్క్‌లోని బెంచిపై షాకింగ్ సీన్.. అర్ధరాత్రి పోలీసులు వచ్చి చూడగా.. చివరకు..

ABN , Publish Date - Apr 09 , 2024 | 02:10 PM

పార్కుల్లో అసాంఘిక కార్యకాలపాలకు పాల్పడడం సర్వసాధారణమైంది. ప్రేమ పేరుతో కొందరు పార్కుల్లో బహిరంగంగా అసభ్యకర పనులు చేస్తుంటే.. మరికొందరు మందుబాబులు పార్కులను తమ అడ్డాగా మార్చుకుంటూ అందరికీ ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇలాంటి ...

Viral Video: పార్క్‌లోని బెంచిపై షాకింగ్ సీన్.. అర్ధరాత్రి పోలీసులు వచ్చి చూడగా.. చివరకు..

పార్కుల్లో అసాంఘిక కార్యకాలపాలకు పాల్పడడం సర్వసాధారణమైంది. ప్రేమ పేరుతో కొందరు పార్కుల్లో బహిరంగంగా అసభ్యకర పనులు చేస్తుంటే.. మరికొందరు మందుబాబులు పార్కులను తమ అడ్డాగా మార్చుకుంటూ అందరికీ ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, పార్క్‌లో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫుల్‌గా తాగి పార్క్‌లోని బెంచిపై పడుకున్నాడు. అర్ధరాత్రి వెళ్లిన పోలీసులకు షాకింగ్ సీన్ కనిపించింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. (Viral Video) ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్ఫూర్‌లోని రాంలీలా పార్క్‌లో ఏప్రిల్ 7వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి (drunk man) ఆదివారం ఫుల్‌గా మద్యం సేవించాడు. రాత్రి ఇంటికి వెళ్లే ఓపిక లేక సమీపంలో ఉన్న రాంలీలా పార్క్‌లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న ఓ బెంచిపై పడుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న అతను బెంచిపై నిద్రిస్తున్న సమయంలో అతను బెంచి మధ్యలోని సందులో నుంచి నేల పైకి జారిపోయాడు. అయితే ఆ సమయంలో అతడి తల బెంచి సందులో (Head stuck in middle of the bench) ఇరుక్కుపోయింది.

Viral Video: నడుస్తూ వెళ్తున్నా.. తప్పని ప్రమాదం.. అయినా ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా..

ఈ క్రమంలో యథాస్థానానికి తిరిగా రాలేక నొప్పితో కేకలు పెట్టాడు. గమనించిన చుట్టు పక్కల వారు పోలీసులకు ఫోన్ చేశారు. అర్ధరాత్రి అక్కడికి చేరుకున్న పోలీసులు.. చాలా సేపు శ్రమించి అతన్ని కాపాడారు. తర్వాత అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతన్ని ఇంటి వద్ద వదిలేశారు. సమయానికి స్పందించి మనవతా దృక్ఫథంతో వ్యవహరించిన పోలీసులను స్థానికులు అభినందించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘అతిగా మద్యం సేవిస్తే.. ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి తప్పులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అందరి ముందే విద్యుత్ తీగను పట్టుకున్న వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - Apr 09 , 2024 | 02:10 PM