Share News

Viral Video: ఒకే గుంతలో ఇరుక్కుపోయిన పాము, ముంగిస.. చివరకు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

ABN , Publish Date - Apr 09 , 2024 | 08:31 PM

పాము, ముంగిస ఎదురుపడితే వాటిలో ఏదో ఒకటి ప్రాణాలు కోల్పోవాల్సిందే.. అన్నంతలా ఫైట్ జరుగుతుంది. ఈ పోరాటంలో కొన్నిసార్లు ముంగిసలు విజయం సాధిస్తే.. మరికొన్నిసార్లు పాములు పైచేయి సాధిస్తుంటాయి. వీటి మధ్య జరిగే ఫైట్ చూస్తే కొన్నిసార్లు గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంటాయి. ఇలాంటి...

Viral Video: ఒకే గుంతలో ఇరుక్కుపోయిన పాము, ముంగిస.. చివరకు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

పాము, ముంగిస ఎదురుపడితే వాటిలో ఏదో ఒకటి ప్రాణాలు కోల్పోవాల్సిందే.. అన్నంతలా ఫైట్ జరుగుతుంది. ఈ పోరాటంలో కొన్నిసార్లు ముంగిసలు విజయం సాధిస్తే.. మరికొన్నిసార్లు పాములు పైచేయి సాధిస్తుంటాయి. వీటి మధ్య జరిగే ఫైట్ చూస్తే కొన్నిసార్లు గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాము, ముంగిస ఒకే గుంతలో కలుసుకున్నాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాము, ముంగిస కలిసి ఓ చిన్న గుంతలో కనిపిస్తాయి. ఈ క్రమంలో వాటి (fight between snake and mongoose) మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ముంగిసను చూడగానే పడగ విప్పిన పాము.. దాన్ని కాటేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ముంగిస ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ దాని కాటు నుంచి తెలివిగా తప్పించుకుంటూ ఎదురుదాడి చేస్తుంది. పాము చాలా సార్లు కాటేయడానికి ప్రయత్నిస్తుంది. అయినా ముంగిస మాత్రం పాము కాటుకు దొరక్కుండా తప్పించుకుంటుంది.

Optical illusion: ఈ బేకరీలో దాక్కుని ఉన్న మొఖాలను గుర్తించండి చూద్దాం..

ఈ క్రమంలో ఉన్నట్టుండి పాముపై ఎదురు దాడి చేస్తుంది. చివరకు దాని తలను గట్టిగా పట్టేసుకుంటుంది. పాము తలను కొరికి తన కాళ్ల కింద కట్టిగా అదిమి పట్టుకుంటుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ముంగిస చాలా తెలివిగా దాడి చేసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అనవసరంగా అడవి దున్నతో పెట్టుకున్నాడే.. చివరికి ఇతడి పరిస్థితి ఏమైందంటే..

Updated Date - Apr 09 , 2024 | 08:35 PM