Share News

Viral Video: గోనె సంచిని ఇలాక్కూడా వాడొచ్చా.. ఇతడి డిజైనింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. !

ABN , Publish Date - Apr 10 , 2024 | 06:13 PM

కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ పది మందిలో ప్రత్యేకంగా నిలుస్తుంటే.. మరికొందరు తమ తెలివితేటలకు మరింత పదను పెట్టి తాము ఎంచుకున్న రంగంలో దూసుకుపోతుంటారు. కొందరు వ్యాపారులు వినూత్నమైన ఆలోచనలతో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి..

Viral Video: గోనె సంచిని ఇలాక్కూడా వాడొచ్చా.. ఇతడి డిజైనింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. !

కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ పది మందిలో ప్రత్యేకంగా నిలుస్తుంటే.. మరికొందరు తమ తెలివితేటలకు మరింత పదను పెట్టి తాము ఎంచుకున్న రంగంలో దూసుకుపోతుంటారు. కొందరు వ్యాపారులు వినూత్నమైన ఆలోచనలతో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గోనె సంచిని వినూత్నంగా మార్చడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు యువకుడి తెలివితేటలు చూసి అభినందిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చెప్పుల షాపులో ఓ యువకుడు గోనె సంచితో (sack bag) వినూత్న ప్రయోగం చేసి అందరినీ అశ్చర్యపరిచాడు. రెండు గోనె సంచులను తీసుకొచ్చిన అతను.. ముందుగా వాటిలో ఒకదాన్ని కెమెరా ముందు చూపిస్తాడు. దాన్ని ఫ్యాంట్‌గా మార్చి కెమెరా ముందే ధరిస్తాడు. ఆ తర్వాత మరో గొనె సంచిని కుర్తాగా (kurta dress) మారుస్తాడు. ఇలా ఫైనల్‌గా ఆ రెండింటిని ధరించి, కెమెరా ముందు ఫోజులు ఇస్తాడు.

Viral Video: సెల్ఫీ తీసుకుంటుండగా మహిళకు వింత అనుభవం.. క్షణాల వ్యవధిలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు చూస్తే..

చూసేందుకు ఈ గొనె సంచి కుర్తా.. ఎంతో అందంగా కనిపిస్తోంది. ఏదో మంచి బ్రాండ్‌కి చెందని కుర్తా తరహాలో కనిపిస్తోంది. గోని కుర్తా పేరుతో ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవావక్కవుతున్నారు. ‘‘బ్రదర్.. మీ తెలివితేటలు అమోఘం’’.. అంటూ కొందరు, ‘‘ఇది కదా అసలు సిసలు డిజైనింగ్ అంటే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇవి కదా తెలివితేటలు అంటే.. పైనాపిల్స్ సేల్స్ పెంచేందుకు ఇతడు వాడిన టెక్నిక్ తెలిస్తే..

Updated Date - Apr 10 , 2024 | 06:13 PM