Share News

Viral Video: ఎస్కలేటర్ ఎక్కుతున్నారా.. అయితే ఇలాంటి తప్పు మాత్రం చేయకండి..

ABN , Publish Date - Apr 11 , 2024 | 08:19 PM

ఓ వైపు రోజు రోజుకూ టెక్నాలజీ పెరుగుతుంటే.. మరోవైపు మనిషికి శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఏ పని చేయలన్నా ఎక్కువగా టెక్నాలజీ పైనే ఆధారపడుతున్నారు. చాలా మంది కనీసం నడవడానికి కూడా బద్ధకిస్తున్నారు. ఇక పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లకు వెళ్లిన సందర్భాల్లో..

Viral Video: ఎస్కలేటర్ ఎక్కుతున్నారా.. అయితే ఇలాంటి తప్పు మాత్రం చేయకండి..

ఓ వైపు రోజు రోజుకూ టెక్నాలజీ పెరుగుతుంటే.. మరోవైపు మనిషికి శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఏ పని చేయలన్నా ఎక్కువగా టెక్నాలజీ పైనే ఆధారపడుతున్నారు. చాలా మంది కనీసం నడవడానికి కూడా బద్ధకిస్తున్నారు. ఇక పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లకు వెళ్లిన సందర్భాల్లో మెట్లకు బదులుగా ఎస్కలేటర్లను ఉపయోగించడం సర్వసాధారణమైంది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఎస్కలేటర్ ఎక్కిన బాలుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లో (Shopping complex) జనాలు రద్దీగా ఉంటారు. మరోవైపు కొందరు ఎస్కలేటర్‌పై పైఅంతస్తుకు వెళ్తుంటారు. వారితో పాటూ ఓ బాలుడు కూడా ఎస్కలేటర్ (Escalator) పైకి ఎక్కేస్తాడు. ఇంత వరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఎస్కలేటర్‌పై ఎక్కిన అతను.. అటూ ఇటూ చూస్తూ చివరు తల కిందకు పెట్టి ముందుకు వంగుతాడు. దీంతో చివరకు ఎస్కలేటర్‌కు, పక్కన గోడకు మధ్యలో అతడి తల ఇరుక్కుంటుంది. కొంత దూరం వరకూ అతను అలాగే ఈడ్చుకుంటూ వస్తాడు. దీంతో పక్కన ఉన్న వారంతా కేకలు వేస్తారు.

Viral Video: ఇదో కొత్త రకం చోరీ.. ఈ మహిళపై చేసిన ప్రయోగం చివరికి ఏమైందో మీరే చూడండి..

వారి కేకలు విన్న సెక్యూరిటీ సిబ్బంది.. ఎస్కలేటర్‌ని ఆపేసి పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. అప్పటికే అతను తల ఇరుక్కుని బయటికి రాలేక విలవిల్లాడుతూ ఉంటాడు. అయితే చివరకు ఎలాగోలా అంతా శ్రమించి, బాలుడిని సురక్షితంగా బయటికి తీస్తారు. అయితే ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాద ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో పెద్దలు అందుబాటులో ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical Illusion: ఈ అడవిలో దాక్కున్న గుర్రాన్ని.. 10 సెకన్లలో కనిపెడితే మీరే కింగ్..

Updated Date - Apr 11 , 2024 | 08:19 PM