Share News

Viral Video: పడుకున్న ఆవులను హింసించాడు.. చూస్తుండగానే అతడికి ఎలాంటి ఫలితం దక్కిందో చూస్తే..

ABN , Publish Date - Apr 12 , 2024 | 05:47 PM

కొందరు తమ శాడిజాన్ని ఇతరులపై ప్రదర్శిస్తూ.. తద్వారా శునకానందం పొందుతుంటారు. చిన్న పిల్లలను ఏడిపిస్తూ ఆనందించే వారు కొందరైతే.. మరికొందరు మూగ జీవాలను హింసిస్తూ ఆనందిస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో వారికి కొన్నిసార్లు తగిన శాస్తి జరుగుతుంటుంది. ఈ తరహా...

Viral Video: పడుకున్న ఆవులను హింసించాడు.. చూస్తుండగానే అతడికి ఎలాంటి ఫలితం దక్కిందో చూస్తే..

కొందరు తమ శాడిజాన్ని ఇతరులపై ప్రదర్శిస్తూ.. తద్వారా శునకానందం పొందుతుంటారు. చిన్న పిల్లలను ఏడిపిస్తూ ఆనందించే వారు కొందరైతే.. మరికొందరు మూగ జీవాలను హింసిస్తూ ఆనందిస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో వారికి కొన్నిసార్లు తగిన శాస్తి జరుగుతుంటుంది. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పడుకున్న ఆవులను హింసించాడు. అయితే అంతలోనే అతడికి తగిన విధంగా శాస్తి జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాత్రి వేళ ఇద్దరు యువకులు నడుస్తూ వెళ్తుంటారు. అదే సమయంలో చాలా అక్కడ పడుకుని విశ్రాంతి తీసుకుంటుంటాయి. వాటిని చూడానే ఆకతాయిల్లో శాడిస్తు బయటికి వస్తాడు. పడుకున్న ఆవులను సూదులతో గుచ్చుతో శునకానందం పొందుతారు. వారిలో ఓ వ్యక్తి అంతటితో ఆగకుండా కాస్త ముందుకు వెళ్లి మరో ఆవు మెడ పట్టుకుని కింద పడేయాలని చూస్తాడు.

Viral Video: హార్ట్ బ్రేకింగ్ సీన్..! పెద్ద గొయ్యి నుంచి ఒకటే శబ్ధాలు.. లైటు వేసి చూడగా..

అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఆవు.. మెడ పట్టుకోగానే ఎగిరి బలంగా ఓ తన్ను (cow kicked a man) తన్నుతుంది. దెబ్బకు ఆ యువకుడు ఎగిరి పక్కన ఉన్న ఇనుప రక్షణ గోడను తగులుకుని కిందపడిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఇలాంటి వారికి ఇలాగే జరగాలి’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఆవు బాగానే బుద్ధి చెప్పింది’’.. అంటూ మరికొందరు, ‘‘మూగజీవాలను హింసించడం నేరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical Illusion: పిల్లలు ఆడుకుంటున్న ఈ బీచ్‌లో ఓ అయస్కాంతం దాక్కుని ఉంది.. ఎవరైనా కనిపెట్టగలరా..

Updated Date - Apr 12 , 2024 | 05:47 PM