Share News

Optical Illusion: పిల్లలు ఆడుకుంటున్న ఈ బీచ్‌లో ఓ అయస్కాంతం దాక్కుని ఉంది.. ఎవరైనా కనిపెట్టగలరా..

ABN , Publish Date - Apr 12 , 2024 | 04:19 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు పిల్లలతో పాటూ పెద్దలను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఫజిల్ ఫొటోలకు సమాధానాలు తెలుసుకోవడం చాలా కష్టమవుతుంటుంది. అయితే...

Optical Illusion: పిల్లలు ఆడుకుంటున్న ఈ బీచ్‌లో ఓ అయస్కాంతం దాక్కుని ఉంది.. ఎవరైనా కనిపెట్టగలరా..

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు పిల్లలతో పాటూ పెద్దలను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఫజిల్ ఫొటోలకు సమాధానాలు తెలుసుకోవడం చాలా కష్టమవుతుంటుంది. అయితే ఇలాంటి సమయంలో మనలోని ఏకాగ్రత బయటపడుతుంది. తాజాగా, ఇలాంటి ఓ ఆసక్తికర ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ పిల్లలంతా ఓ బీచ్‌లో ఆడుకుంటున్నారు. అయితే ఇదే బీచ్‌లో ఓ అయస్కాంతం కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ బీచ్‌లో కొందరు పిల్లలు (Children playing on the beach) ఆడుకుంటుంటారు. వారిలో ముగ్గురు పిల్లలు ఇసుకతో మేడలు కడుతుంటారు. మరో బాలుడు పక్కనే ఉన్న ఐస్‌క్రీం బండి వద్ద నుంచి రెండు ఐస్ క్రీంలను కొనుక్కుని వస్తుంటాడు. అలాగే మరో బాలిక కూడా ఐస్ క్రీం బండి వద్ద నిలబడి ఉంటుంది.

Viral Video: పెళ్లి వేదికపై ఐ ఫోన్ అన్‌బాక్స్ చేసిన వరుడు.. చివరికి అందరికీ ఎలాంటి షాక్ ఇచ్చాడంటే..

అలాగే అటు పక్కనే మరో వ్యక్తి బీచ్‌లో స్కేటింగ్ చేసేందుకు వెళ్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే మీ ముందు ఓ టాస్క్‌ను పెడుతున్నాం. ఈ బీచ్‌లో ఓ అయస్కాంతం (magnet) కూడా దాక్కుని ఉంది. అయితే ఆ అయస్కాంతం ఎవరికీ అనుమానం రాకుండా ఓ వస్తువులో కలిసిపోయింది. దాన్ని గుర్తించడం మీకు ఎంతో కష్టంగా అనిపించవచ్చు. అయితే కాస్త తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం ఎంతో సులభం. ఇంకెందుకు ఆలస్యం.. ఆ అయస్కాంతాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నించండి. ఇప్పటికీ దాన్ని గుర్తించలేని వారంతా ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral-phot.jpg

Viral Video: కొమొడో డ్రాగన్‌తో సై అంటే సై అన్న దున్నపోతు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

Optical Illusion: ఈ అడవిలో దాక్కున్న గుర్రాన్ని.. 10 సెకన్లలో కనిపెడితే మీరే కింగ్..

Updated Date - Apr 12 , 2024 | 04:19 PM