Share News

Viral Video: హార్ట్ బ్రేకింగ్ సీన్..! పెద్ద గొయ్యి నుంచి ఒకటే శబ్ధాలు.. లైటు వేసి చూడగా..

ABN , Publish Date - Apr 12 , 2024 | 04:51 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలు.. భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. తాజాగా...

Viral Video: హార్ట్ బ్రేకింగ్ సీన్..! పెద్ద గొయ్యి నుంచి ఒకటే శబ్ధాలు.. లైటు వేసి చూడగా..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలు.. భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద గొయ్యి నుంచి శబ్ధాలు వస్తుండడంతో.. ఏముందా అని లైటు వేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి అంతా షాక్ అయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మంచు ప్రదేశంలో ఓ పెద్ద గొయ్యి నుంచి వింత వింత శబ్ధాలు వచ్చాయి. దీంతో అక్కడున్న వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. చివరకు కొందరు గొయ్యి సమీపానికి వెళ్లి, అందులో ఏముందో చూడాలని అనుకున్నారు. గొయ్యిలో మొత్తం చీకటిమయంగా ఉండడంతో లైటు వేశారు. లైటు వేయగానే ఒక్కసారిగా వారికి షాకింగ్ సీన్ కనిపించింది.

Viral Video: కొమొడో డ్రాగన్‌తో సై అంటే సై అన్న దున్నపోతు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

గొయ్యిలో ఓ పెద్ద ఎలుగుబంటి ( bear sleeping in pit) నిద్రపోతూ ఉంది. లైటు వేయగానే కళ్లు తెరిచిన ఎలుగుబంటిని చూసి అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చాలా ఎలుగు బంట్లు ఏడాదిలో 6 నుంచి 8 నెలల పాటు నిద్రావస్థలో ఉంటాయి. మిగిలిన కాలంలో వేటకు వెళ్తుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎలుగు బంటి కూడా అలాంటి పరిస్థితిలో ఉందని పలువురు చెబుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Optical Illusion: పిల్లలు ఆడుకుంటున్న ఈ బీచ్‌లో ఓ అయస్కాంతం దాక్కుని ఉంది.. ఎవరైనా కనిపెట్టగలరా..

Updated Date - Apr 12 , 2024 | 04:52 PM