Share News

Viral Video: మొసలి కంటపడిన పాము.. ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించడంతో.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Apr 13 , 2024 | 05:43 PM

మొసలి వేట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీటిలో ఉన్న మొసలి.. ఎంత పెద్ద జంతువుకైనా చివరకు చుక్కలు చూపిస్తుంది. ఒక్కసారి వాటి బారిన పడ్డాయంటే.. ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మొసలి సాధారణంగా...

Viral Video: మొసలి కంటపడిన పాము.. ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించడంతో.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

మొసలి వేట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీటిలో ఉన్న మొసలి.. ఎంత పెద్ద జంతువుకైనా చివరకు చుక్కలు చూపిస్తుంది. ఒక్కసారి వాటి బారిన పడ్డాయంటే.. ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మొసలి సాధారణంగా నీళ్లు తాగడానికి వచ్చే గేదెలు, జిరాఫీలు, జింకలు తదితర జంతువులతో పాటూ కొన్నిసార్లు పులులు, సింహాలపై కూడా దాడి చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మొసలి పామును వెంబడించడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మొసలి కంటపడిన పాము.. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని (South Africa) క్రుగర్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకలితో ఉన్న ఓ మొసలి.. ఆహారం కోసం ఎదురుచూస్తుంటుంది. అయితే ఆ సమయంలో నీటి వద్దకు ఏ జంతువూ రాదు. అయినా మొసలి ఒపిగ్గా ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఇంతలో ఓ పెద్ద విషపరిత పాము అటుగా వస్తుంది. దాన్ని చూడగానే (Crocodile attack on snake) మొసలి దాడి చేయాలని చూస్తుంది. మొసలి రావడాన్ని చూసి పాము తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అక్కడి నుంచి వేగంగా పారిపోయి ఒడ్డుకు చేరుకుంటుంది.

Puzzle: ఈ రెండు ఫొటోల్లో 3 తేడాలున్నాయి.. అవేంటో కనిపెట్టారంటే మీరే జీనియస్..

అప్పటికే ఆకలితో ఉన్న మొసలి.. ‘‘ఈ పూటకు ఎలాగైనా ఈ పామును కానివ్వాల్సిందే’’.. అని అనుకుని నీటి ఒడ్డుకు వేగంగా పాకుతూ వెళ్తుంది. బురదలో మెల్లిగా వెళ్తున్న పాముపై ఒక్కసారిగా అటాక్ చేస్తుంది. చివరకు అనుకున్నట్లుగానే పామును నోటితో గట్టిగా పట్టుకుని నీటిలోకి లాక్కొస్తుంది. ఇలా పాము మొసలి దాడిలో ప్రాణాలు కోల్పోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! ఇలాంటి సీన్ మొదటిసారి చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘ఈ మొసలి చాలా భయంకరంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పడుకున్న ఆవులను హింసించాడు.. చూస్తుండగానే అతడికి ఎలాంటి ఫలితం దక్కిందో చూస్తే..

Updated Date - Apr 13 , 2024 | 05:43 PM