Share News

Viral Video: ఎక్సకవేటర్‌తో మట్టి తవ్వుతుండగా ఊహించని ఘటన.. బండను పైకి ఎత్తి చూడగా షాకింగ్ సీన్..

ABN , Publish Date - Apr 12 , 2024 | 09:31 PM

కొందరు గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు చేపడుతుంటారు. అయినా చాలా సందర్భాల్లో భూమిలో ఎలాంటి వస్తువులూ కనిపించవు. అయితే కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో తమ పనిలో భాగంగా తవ్వకాలు చేస్తుంటే.. ఉన్నట్టుండి..

Viral Video: ఎక్సకవేటర్‌తో మట్టి తవ్వుతుండగా ఊహించని ఘటన.. బండను పైకి ఎత్తి చూడగా షాకింగ్ సీన్..

కొందరు గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు చేపడుతుంటారు. అయినా చాలా సందర్భాల్లో భూమిలో ఎలాంటి వస్తువులూ కనిపించవు. అయితే కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో తమ పనిలో భాగంగా తవ్వకాలు చేస్తుంటే.. ఉన్నట్టుండి చిత్రవిచిత్ర వస్తువులు బయటపడడం చూస్తూ ఉంటాం. పాత ఇళ్లు కూలుస్తుండగా బంగారు నాణేలు, పొలాన్ని దున్నుతుండగా వజ్రాలు బయటపడిన సందర్భాలను చాలా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఎక్సకవేటర్‌తో మట్టి తవ్వుతుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద బండను పైకి ఎత్తి చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎక్సకవేటర్‌తో (Excavator) మట్టి తవ్వుతుంటాడు. అయితే కొన్ని అడుగులు తవ్వాక.. అందులో ఓ పెద్ద బండ రాయి ఉంటుంది. దాన్ని పైకి ఎత్తే క్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. బండను పైకి ఎత్తగా దాని కింద పాత కాలం నాటి బంగారు విగ్రహం (gold sculpture) ఒకటి కనిపిస్తుంది.

Viral Video: పడుకున్న ఆవులను హింసించాడు.. చూస్తుండగానే అతడికి ఎలాంటి ఫలితం దక్కిందో చూస్తే..

బంగారు విగ్రహాన్ని చూడగానే అక్కడున్న వారంతా షాక్ అవుతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! లక్కీ చాన్స్ కొట్టారుగా’’.. అని కొందరు అంటుంటే.., ‘‘ఇదంతా ఫేక్.. వ్యూస్ కోసమే ఇలా చేశారు’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 53 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Wife: భార్య పక్కన మేనమామను అసభ్యకర స్థితిలో చూసిన భర్త.. 22 ఏళ్ల తర్వాత సడన్‌గా.. అతన్ని ఇంటికి పిలిచి మరీ..

Updated Date - Apr 12 , 2024 | 09:31 PM