Share News

Watch Video: అరటిపండ్లతో ఇలాంటి వ్యాపారం ఎక్కడైనా చూశారా.. తొక్క తీసి చూడగా పండు మధ్యలో..

ABN , Publish Date - Apr 13 , 2024 | 07:36 PM

చాలా మంది వ్యాపారం చేస్తుంటారు గానీ.. అందులో కొంత మందే సక్సెస్ అవుతుంటారు. వారిలో వినూత్నంగా ఆలోచించే వారు మరిన్ని లాభాలను ఆర్జిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు ఒకరిని మించి మరొకరు తెలివితేటలు ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి..

Watch Video: అరటిపండ్లతో ఇలాంటి వ్యాపారం ఎక్కడైనా చూశారా.. తొక్క తీసి చూడగా పండు మధ్యలో..

చాలా మంది వ్యాపారం చేస్తుంటారు గానీ.. అందులో కొంత మందే సక్సెస్ అవుతుంటారు. వారిలో వినూత్నంగా ఆలోచించే వారు మరిన్ని లాభాలను ఆర్జిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు ఒకరిని మించి మరొకరు తెలివితేటలు ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఓ వ్యక్తి అరటిపండ్లకు వెరైటీ కాంబినేషన్ జత చేసి విక్రయిస్తున్నాడు.


గుజరాత్‌లోని (Gujarat) సూరత్‌లో విక్రయిస్తున్న వినూత్న అరటి పండ్ల వీడియో (Viral video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అరటిపండ్లను వినూత్నంగా విక్రయిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. రోడ్డు పక్కన అందంగా డిజైన్ చేసిన బండిపై అరటిపండ్లను వెరైటీగా సిద్ధం చేశాడు. ఇందుకోసం ముందుగా అరటి పండుకు ఓ చివరను కట్ చేశాడు. తర్వాత పండుకు మధ్యలో పొడవాటి రంధ్రం చేశాడు. ఆ తర్వాత అందులో (Chocolate syrup in banana) చాక్లెట్ సిరప్‌ను సిరంజితో నింపేశాడు.

Viral Video: హైదరాబాద్‌లో ఐస్ యాపిల్ బిర్యానీ యమ క్రేజ్ గురూ.. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటంటే..

ఫైనల్‌గా అరటిపండును టిష్యూ పేపర్‌తో చుట్టేసి కస్టమర్లకు అందించాడు. అలాగే చాక్లెట్ ప్లేవర్ కాకుండా పండు మధ్యలో జామ్, పీ నట్, స్ట్రాబెర్రీ తదితర ప్లేవర్లను కూడా మిక్స్ చేసి అందిస్తున్నాడు. ఈ వినూత్న ఆహారాల కలయిక అందరికీ నచ్చడంతో యువతి ఇతడి బండి వద్దకు క్యూ కడుతున్నారు. ఈ వెరైటీ అరటిపండను సదరు వ్యాపారి రూ.60 కి అందిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కాంబినేషన్ చాలా బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘రూ.60కి డజను అరటిపండ్లను కొనొచ్చు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 32 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మొసలి కంటపడిన పాము.. ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించడంతో.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

Updated Date - Apr 13 , 2024 | 07:38 PM