Share News

Viral Video: ఆడ సింహానికి కోపం వస్తే.. మగ సింహానిదీ మగాళ్ల పరిస్థితే.. కావాలంటే ఈ వీడియో చూడండి..

ABN , Publish Date - Apr 14 , 2024 | 07:45 PM

‘‘వీధిలో పులి.. ఇంట్లో పిల్లి’’.. అన్న సామెంత చందంగా.. కొందరు బయట అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. కానీ ఇంట్లోకి వెళ్లగానే కుక్కిన పేనులాగా పడుంటారు. అయితే ఇది మనుషులకే కాదు.. కొన్నిసార్లు జంతువులకూ వర్తిస్తుంది. ఇందుకు నిదర్శనంగా...

Viral Video: ఆడ సింహానికి కోపం వస్తే..  మగ సింహానిదీ మగాళ్ల పరిస్థితే.. కావాలంటే ఈ వీడియో చూడండి..

‘‘వీధిలో పులి.. ఇంట్లో పిల్లి’’.. అన్న సామెంత చందంగా.. కొందరు బయట అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. కానీ ఇంట్లోకి వెళ్లగానే కుక్కిన పేనులాగా పడుంటారు. అయితే ఇది మనుషులకే కాదు.. కొన్నిసార్లు జంతువులకూ వర్తిస్తుంది. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆడ సింహానికి కోపం రావడంతో చివరకు మగ సింహానికి చుక్కలు చూపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మగ సింహానిదీ మగాళ్ల పరిస్థితే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఫారెస్ట్‌లోని రోడ్డు పక్కన బ్రిడ్జి కింద ఓ ఆడ సింహం సేద తీరుతూ ఉంటుంది. అంతలోనే ఓ మగసింహం అక్కడికి వచ్చి.. ఆడ సింహాన్ని విసిగిస్తుంది. దీంతో అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఆడ సింహం ఒక్కసారిగా రెచ్చిపోతుంది. ‘‘ప్రశాతంగా పడుకుని ఉంటే.. విసిగిస్తావా.. చూడు నిన్ను ఏం చేస్తానో’’.. అన్నట్లుగా మగ సింహంపై (Lioness attacks lion) దాడికి దిగుతుంది. దీంతో మగ సింహం కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది.

Viral Video: పిల్ల చేష్టలంటే ఇవే.. స్కూటీపై వెళ్తున్న ముగ్గురు.. మధ్యలో కూర్చున్న బాలుడి తుంటరి పనికి..

మధ్యలో ఆడ సింహంపై ఎదురుదాడి చేస్తుంది. అయినా ఆడ సింహం.. ఏమాత్రం తగ్గకుండా మగ సింహానికి చుక్కలు చూపిస్తుంది. దీంతో చివరకు ఆడ సింహం దాటికి తోక ముడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఆడ సింహం ఆవేశం.. మూమూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘భార్య ముందు భర్త ఎలా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కొంపతీసి ఇది కొత్త ట్రెండ్ కాదు కదా.. సెలూన్ షాప్‌లో ఈమె చేస్తున్న పని చూడండి..

Updated Date - Apr 14 , 2024 | 07:45 PM