Share News

Viral Video: మాంసం తింటుండగా పులి నోట్లో ఇరుక్కున్న ఎముక.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN , Publish Date - Apr 16 , 2024 | 06:41 PM

మాంసం తినే సమయంలో పళ్ల సందుల్లో ముక్కలు ఇరుక్కోవడం సర్వసాధారణం. ఇలాంటి సమయాల్లో చాలా మంది పుల్లల సాయంతో బయటికి తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఇదే సమస్య జంతువులకు వస్తే ఏం చేస్తాయని మీకెప్పుడైనా సందేహం వచ్చిందా. అందులోనూ...

Viral Video: మాంసం తింటుండగా పులి నోట్లో ఇరుక్కున్న ఎముక.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

మాంసం తినే సమయంలో పళ్ల సందుల్లో ముక్కలు ఇరుక్కోవడం సర్వసాధారణం. ఇలాంటి సమయాల్లో చాలా మంది పుల్లల సాయంతో బయటికి తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఇదే సమస్య జంతువులకు వస్తే ఏం చేస్తాయని మీకెప్పుడైనా సందేహం వచ్చిందా. అందులోనూ మాంసాహార జీవులైన పులులు, సింహాలకు ఇలాంటి సమస్య వస్తే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. మాంసం తింటున్న సమయంలో పులి నోట్లో పెద్ద ఎముక ఇరుక్కుంది. దాన్ని బయటికి తీయాలని పులి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు ఏమైందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వేటాడిని ఓ పెద్ద పులి మాంసాన్ని తినే క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. మాంసం తింటున్న సమయంలో ఉన్నట్టుండి పులి పళ్ల మధ్యలో (bone got stuck in the tiger tooth) ఓ పెద్ద ఎముక ఇరుక్కుంటుంది. ఎముక చాలా పెద్దది కావడంతో పాటు పులి పండులో గుచ్చుకుపోవడంతో దాన్ని బయటికి తీసుకోవడం పులి వల్ల సాధ్యం కాలేదు. ఎంత ప్రయత్నించినా ఎముక మాత్రం బయటికి రాలేదు. దీనికితోడు నోరూ మూయడం కూడా సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న సమయంలో పులిని ఫారెస్ట్ సిబ్బంది గమనిస్తారు. చివరకు పులికి మత్తు మందు ఇచ్చి బంధించారు.

Puzzle: ఈ చిత్రంలో దాక్కున్న ప్లాస్టిక్ స్ట్రాను కనుక్కోగలరేమో ప్రయత్నించండి..

tiger-viral-videos.jpg

అక్కడికి వచ్చిన వైద్య బృందం పులి నోరు తెరచి ఎముకను తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికీ వారికి సాధ్యం కాలేదు. చివరకు సుత్తి తీసుకుని ఎముకను బలంగా కొట్టడంతో బయటికి వచ్చింది. ఇలా ఎట్టకేలకు ఎముకను బయటికి తీసి, పులికి రిలీఫ్ కలిగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! పులికీ ఎముకల బాధ తప్పలేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎవరూ చూడకుంటే పులి పరిస్థితి ఏంటో’’.. అంటూ మరికొందరు, ‘‘పులికి ఎంతో సాయం చేశారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 29 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దాహంతో నడిరోడ్డుపై ఏనుగు తంటాలు.. నీళ్ల క్యాన్లు మోస్తున్న యువకుడు చూడడంతో.. చివరకు..

Updated Date - Apr 16 , 2024 | 06:48 PM