ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: రోజూ పడవలో ఒంటరిగా ప్రయాణిస్తున్న కుక్క .. అసలేం జరుగుతోందని ఆరా తీస్తే..

ABN, Publish Date - Apr 05 , 2024 | 09:55 PM

ఇస్తాంబుల్‌లో ప్రతి రోజూ ప్రజారవాణా సాధనాల్లో 30 కిలోమీటర్ల మేర ఒంటరిగా ప్రయాణించే బోజీ అనే వీధి కుక్క ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయ్యింది.

ఇంటర్నెట్ డెస్క్: రోజూ ఆ కుక్క పడవలో ప్రయాణిస్తుంది. అంతేకాదు.. సబ్‌వే రైళ్లు, ట్రాములు, బస్సులు ఇలా అన్నీ ఎక్కేస్తుంది. ఎవరినీ చూసి మొరగదు. రూల్స్ ఫాలో అవుతూ తను దిగాల్సిన చోట దిగిపోతుంది. కుక్క తీరును పరిశీలించిన కొందరు అధికారులకు డౌటొచ్చి దాన్నే ఫాలో అయితే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ (Viral) అవుతున్న ఈ కుక్క కథెంటో తెలిస్తే..

Viral: షాకింగ్.. ఎంత పని చేసిందీ గంగిరెద్దు! సైలెంట్‌గా కనిపిస్తూనే ఒక్కసారిగా..


ఇంతటి పాప్యులారిటీ సాధించిన ఈ కుక్క పేరు బోజీ (Boji Street Dog). ఉండేది ఇస్తాంబుల్‌లో (తుర్కియే) (Istanbul)! ఇది వీధి కుక్కే కానీ ఇది నిత్యం ప్రజారవాణా వ్యవస్థలను విరివిగా వాడుతుంది. ప్రతి రోజూ ట్రాములు, సబ్‌వే రైల్లు, పడవల్లో (Public Transport) ప్రయాణిస్తు 30 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది. కుక్క తీరును పరిశీలించిన అధికారులకు చాలా కాలం పాటు ఏమీ అంతుబట్టలేదు. అసలు అది ఎందుకు రోజూ ఇంత దూరం అప్‌ అండ్ డౌన్ చేస్తోందో అర్థం కాలేదు. ఆహారం కోసమో లేదో మరేదైనా అవసరం కోసమో అది రోజూ జర్నీ చేయట్లేదని తెలిసి అధికారులు ఆశ్చర్యపోయారు.

Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..


ప్రజలతో ఇంతలా ప్రయాణిస్తున్నా ఆ కుక్క ఒక్కసారి కూడా ఎవరినీ కరవలేదు. కనీసం మొరగను కూడా లేదు. జస్ట్ జనాలతో పాటూ రైళ్లు, బస్సులు, ఎక్కి దిగుతుంటుంది. ఎందుకైనా మంచిదని దాని కొన్నాళ్ల పాటు పరిశీలించిన అధికారులు కుక్కతో సమస్యలు రావని పూర్తిస్థాయిలో నిర్ధారించుకున్నాక దాన్ని దానిమాన వదిలిపెట్టేశారు.

బోజీ ఆహారం కోసమో తిండి కోసమే వెళ్లట్లేదని ఓ ఫొటోగ్రాఫర్‌ చెప్పుకొచ్చారు. జనాలతో కలిసి ప్రయాణించడం దానికి ఇష్టమన్నాడు. కొత్త వారిని చూస్తూ అది జర్నీలు ఎంజాయ్ చేస్తోందని చెప్పుకొచ్చారు. అధికారులు కూడా దాదాపు ఇదే భావించారు. దీంతో, దాని మానాన దాన్ని వదిలేశారు. అయితే, కుక్క ప్రయాణాల వెనక ఏదో పెద్ద కారణమే ఉంది కానీ అది ఇంకా అంతుబట్టలేదనేది అధిక సంఖ్యాకుల మాట!

Viral: నువ్వు ఎప్పటికీ సింగిల్‌గా మిగిలిపోతావ్.. మహిళపై విమర్శల వర్షం.. ఏం జరిగిందంటే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2024 | 10:01 PM

Advertising
Advertising