Share News

Lion: సింహాలు ఇలాక్కుడా చేస్తాయా? నోరూరిస్తున్న అడవిదున్నను చంపకుండా..

ABN , Publish Date - Apr 02 , 2024 | 08:12 PM

సింహాలు తమలో తామే గొడవపడుతుంటే నోటి కాడ కూడు జారిపోయిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Lion: సింహాలు ఇలాక్కుడా చేస్తాయా? నోరూరిస్తున్న అడవిదున్నను చంపకుండా..

ఇంటర్నెట్ డెస్క్: సింహాల వేటలో బోలెడన్ని విషయాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో అవి తాము టార్గెట్ చేసుకున్న జంతువును చంపలేవని నిపుణులే చెబుతుంటారు. వ్యూహం వికటించడం లేదా, ఇతర జంతువులు తిరగబడటం చేస్తే సింహాలు ప్రాణాలు కాపాడుకునేందుకు తోక ముడిచి పారిపోతాయి. కానీ, ఏదైనా జంతువు పీకను సింహం నోట కరిచిందంటే వేట దాదాపు పూర్తయినట్టే. దానికి చావు మూడినట్టే. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే అవి సింహం నుంచి తప్పించుకోగలుగుతాయి. అలాంటి ఓ వింత ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..


ఈ వీడియోలో సింహాల గుంపు ఓ అడవి దున్నను లొంగదీసుకుంది. నేల మీద పడదోసి అదిమిపెట్టింది.ఓ భారీ సింహం దాని పీక పట్టింది. అడవి దున్నఏమో ఊపిరాడక విలవిల్లాడుతోంది. మరికొన్ని క్షణాలు ఆగితే దాని ప్రాణాలు పోతాయి. ఇంతలో సింహాల మధ్య సడెన్‌గా గొడవ మొదలైంది. దీంతో, సింహాల దృష్టి ఒక్కసారిగా మళ్లింది. ఈ క్రమంలో అవి ఒకటితో మరొకటి తగవు పడుతు అడవి దున్నపై నుంచి దృష్టి మరల్చాయి (Lions distracted by fight). దీంతో, అది లేచేందుకు ప్రయత్నించింది. చివరకు దాని పీక నోటపట్టుకున్న సింహం కూడా గొడవకు పక్కకు జరిగిపోవడంతో అడవి దున్న మెల్లగా ఓపిక కూడ దీసుకుని లేచింది. సింహాల దాడిలో తీవ్రగాయాలపాలైనా మెల్లగా నడుచుకుంటూ వెళ్లిపోయింది (buffalo Escapes). అది అలా వెళ్లిపోతున్నా సింహాలు మాత్రం పట్టించుకోకుండా తమలో తాము గొడవపడుతూ పక్కకు వెళ్లిపోయాయి.

Viral: ఈ పెద్దాయనను చూడండి! వీధుల్లో ట్రాఫిక్ పోలీసులు ఎదురుపడితే..


వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోతున్నారు. సింహాలు ఇలాక్కూడా చేస్తాయా అంటూ నోరెళ్లబెడుతున్నారు. నోరూరించే ఆహారం కళ్లముందే ఉన్నా ఇలా గొడవపడుతూ చెల్లాచెదురైపోవడం ఏంటని కామెంట్ చేస్తున్నారు. జనాలు ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తూ, కామెంట్ల వర్షం కురిపిస్తుండటంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Viral: కూతురు లండన్ నుంచి విదేశీ ప్రియుణ్ణి ఇంటికి తీసుకొస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 08:19 PM